అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా! | Allu Arjun With Funny Meme T-Shirt | Sakshi
Sakshi News home page

Allu Arjun: ట్రెండ్ ఫాలో అవుతున్న బన్నీ.. ఇది చూశారా?

May 2 2025 4:29 PM | Updated on May 2 2025 4:38 PM

Allu Arjun With Funny Meme T-Shirt

మీకు మీమ్ లాంగ్వేజ్ తెలుసా? అవును మీరు సరిగానే విన్నారు. అందరూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వచ్చా అని అంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగించేవాళ్లకు మీమ్ లాంగ్వేజ్ అని ఒకటుంది. బయటవాళ్లకు అది అర్థం కాదు కానీ ఇన్ స్టా వాడేవాళ్లకు బాగా తెలుసు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అల్లు అర్జున్(Allu Arjun).. మీమ్ లాంగ్వేజ్ ఉన్న ఓ టీ షర్ట్ ధరించాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా' అని ఫేమస్ బ్రహ్మానందం డైలాగ్, ఆయన ఫొటోలతో ఉన్న టీ షర్ట్ తో కనిపించాడు. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నాడే అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ'

సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2'(Pushpa 2 Movie) బ్లాక్ బస్టర్ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ దర్శకుడు అట్లీతో(Director Atlee) సినిమాను ప్రకటించాడు. మూవీ ఎలా ఉండబోతుందనే వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రాజెక్ట్ మొదలవకుండానే హైప్ పెరిగిపోయింది. ప్రస్తుతం హీరోయిన్లు, ఇతర క్యాస్టింగ్ ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది. మరికొన్ని నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

మరోవైపు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం మైథలాజికల్ స్టోరీ ఒకటి రెడీ చేశారు. లెక్క ప్రకారం పుష్ప 2 తర్వాత ఇదే మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గురూజీ స్క్రిప్ట్ ని బన్నీ కాస్త పక్కనబెట్టాడు. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుంది. కానీ దీనికి మరో ఏడాది సమయం పట్టొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) 

Advertisement
 
Advertisement
Advertisement