
రష్మిక ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. దీంతో పాటు మైసా అనే మరో నాయికా ప్రధానమైన సినిమా కూడా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు(జులై 27) ఈ చిత్రం షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది.
అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో రష్మిక పాల్గొనడమే కాకుండా..గోండు పాటకు స్టెప్పులేసి అందరికి అలరించింది. సినిమా ఓపెనింగ్‌కి వచ్చిన గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక మైసా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు. అన్‌ఫార్ములా ఫిలింస్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో ‘మైసా’ అనే పదానికి ‘తల్లి’ అని అర్థం. ఈ సినిమాలో గోండు జాతి హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక నటించబోతుందని సమాచారం.
