కాంత తీసినందుకు గర్వంగా ఉంది: రానా దగ్గుబాటి | Rana Daggubati spoke about Dulquer Salmaan Kanta | Sakshi
Sakshi News home page

కాంత తీసినందుకు గర్వంగా ఉంది: రానా దగ్గుబాటి

Nov 15 2025 3:49 AM | Updated on Nov 15 2025 3:49 AM

Rana Daggubati spoke about Dulquer Salmaan Kanta

‘‘కాంత’ సినిమాకి వస్తున్న ప్రేక్షకుల స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దుల్కర్‌.. తన కెరీర్‌ అత్యద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’’ అని రానా దగ్గుబాటి తెలిపారు. దుల్కర్‌ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజన్  దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు.

దుల్కర్‌ సల్మాన్  వేఫేర్‌ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ–‘‘చాలా గ్యాప్‌ తర్వాత నేను స్క్రీన్‌ మీద కనిపించడంతో నాపాత్రకి కూడా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి’’ అని చె΄్పారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ–‘‘కాంత’లో నా నటన ప్రేక్షకులకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆరు నెలలు చెన్నైలోనే ఉన్నాను’’ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement