మాస్‌ మహారాజాకి జోడీగా క్లాస్‌ మహారాణి.. ఎవరీ భాగ్యశ్రీ బోర్సే? | Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Latest Film | Sakshi
Sakshi News home page

మాస్‌ మహారాజాకి జోడీగా క్లాస్‌ మహారాణి.. ఎవరీ భాగ్యశ్రీ బోర్సే?

Dec 17 2023 10:51 AM | Updated on Dec 17 2023 11:13 AM

Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Latest Film - Sakshi

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్, కాస్టింగ్ ఎంపిక‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ని సెలెక్ట్‌ చేసి అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించబోతుందని తెలియజేస్తూ..ఓ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అందులో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా ఉంది.  చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించింది. హరీశ్‌ శంకర్‌ తన సినిమాల్లో హీరోయిన్స్‌ని అందంగా చూపిస్తాడు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతుంది.

ఎవరీ భాగ్యశ్రీ?
పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే..ఓ పాపులర్‌ మోడల్‌. వయసు 33 ఏళ్లు.  యారియాన్ 2 మూవీలో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. తెరపై అందంగా కనిపించడమే కాకుండా.. యాక్టింగ్‌ పరంగానూ మెప్పించింది. అందుకే హరీశ్‌ శంకర్‌ ఆమెను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారికి సంబంధించిన వివరాలను మేకర్స్‌ వెల్లడించే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement