
విభిన్న చిత్రాలు చేస్తూ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం 'కాంత' అనే మూవీ చేస్తున్నాడు. రానా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్.. కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వచ్చే నెల 12న మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అలా తొలి పాటని విడుదల చేశారు.
(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)
'పసి మనసే' అంటూ సాగే పాటని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్-భాగ్యశ్రీ డ్యాన్స్.. పాత సినిమాల్లో పాటల్ని గుర్తుచేస్తోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ కథతో తీసిన ఈ సినిమాలో దుల్కర్ హీరో పాత్ర పోషిస్తుండగా, సముద్రఖని దర్శకుడిగా కనిపించబోతున్నారు. ఓ మూవీ తేసే విషయమై వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ఈగోలు చోటుచేసుకున్నాయి. చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు)