
దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. 'మహానటి', 'సీతారామం' చిత్రాల దెబ్బకు స్ట్రెయిట్ తెలుగు హీరోల కంటే బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే చేసిన సినిమా 'కాంత'. ప్రముఖ హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. తాజాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ.. 'అర్జున్ చక్రవర్తి' టీజర్ రిలీజ్)
గతంలో 'మహానటి' సినిమాలో శివాజీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు 'కాంత' మూవీలోనూ 1960ల్లో ఉంటే ఓ స్టార్ హీరోగా నటించాడు. టీజర్ బట్టి చూస్తే..దుల్కర్ ఓ స్టార్ హీరో. సముద్రఖని ఓ దర్శకుడు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి మెలిసి ఉంటారు. కానీ తర్వాత గొడవలు వచ్చి విడిపోతారు. అలాంటిది సముద్రఖని తీసే 'శాంత' అనే హారర్ మూవీలో దుల్కర్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లు. ఇక ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దుల్కర్-సముద్రఖని మధ్య ఏం జరిగింది? అనేదే సినిమాలా అనిపిస్తుంది.
టీజర్ చూస్తుంటేనే సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీలా ఉండబోతుందనే ఫీల్ వచ్చింది. ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. సెప్టెంబరు 12న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చూస్తుంటే దుల్కర్ మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)