
స్పోర్ట్స్ డ్రామాలు సరిగా తీయాలే గానీ మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అలా గతంలో వచ్చిన 'జెర్సీ', 'భాగ్ మిల్కా భాగ్' తదితర చిత్రాల తరహాలో ఇప్పుడు తెలుగులో ఓ మూవీని తెరకెక్కించారు. అదే 'అర్జున్ చక్రవర్తి'. కబడ్డీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్ర టీజర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా)
1985,87,89 ప్రాంతంలో భారత్ తరఫున ఆడి గుర్తింపు దక్కని ఓ కబడ్డీ ప్లేయర్ స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. టీజర్ చూస్తుంటే స్టోరీతో పాటు విజువల్స్ ఇంప్రెసివ్‌గా అనిపించాయి. లీడ్ యాక్టర్‌గా చేసిన విజయ్ రామరాజు ఆకట్టుకున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతానికి టీజర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.
కేవలం నిమిషం టీజర్‌తోనే 'అర్జున్ చక్రవర్తి' ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. భావోద్వేగాలు, బలమైన కథ, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)