
ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ పాపులర్ అవుతూ ఉంటుంది. అలా గత కొన్నాళ్లలో చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది గానీ వరస అవకాశాలు ఈమెని వరించాయి.
ప్రస్తుతం తెలుగులో రామ్ కొత్త సినిమాలో, అలానే దుల్కర్ సల్మాన్ 'కాంత'లో భాగ్యశ్రీనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే మూవీలోనూ ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె ఇప్పుడు ఓ సాహసం చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా)
'వన్ లైఫ్, వన్ బ్రీత్, వన్ జంప్' అని భాగ్యశ్రీ.. దుబాయిలో స్కై డైవింగ్ చేసింది. ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి దూకేస్తారు. చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ.. ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేసి తన చిన్న చిన్న కోరికలని భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది.
మరోవైపు భాగ్య శ్రీ.. తెలుగు హీరో రామ్ తో డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత కలిసి ఓ సినిమా చేస్తున్న వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే ఇది నిజమా? మూవీ పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలతోనే కాదు సాహసాలు చేస్తూ కూడా ట్రెండింగ్ లో ఉంటోందిగా.
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు)