
కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే సూపర్ హిట్ అవుతుంటాయి. అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంటాయి. రీసెంట్ టైంలో అలా ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'తుడరమ్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
మార్చి చివర్లో ఎల్ 2:ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన మోహన్ లాల్ కాస్త నిరాశపరిచాడు. ఇది వచ్చిన నెలరోజులకే 'తుడరమ్' చిత్రంతో వచ్చారు. ఊహించని విధంగా ఇది సక్సెస్ అయింది. ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వసూళ్లుతో ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.
(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)
అసలు ప్రచారమే లేకుండా తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.2 కోట్ల మేర వసూళ్లు వచ్చాయట. దీంతో ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారిందట. లెక్క ప్రకారం గత వారం స్ట్రీమింగ్ కావాలి. కానీ థియేటర్లలో ఇంకా ఆదరణ వస్తున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ మరికొన్నాళ్లు ఆలస్యం కానుందట. అంటే జూన్ లో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.
తుడరమ్ విషయానికొస్తే.. బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్. అతడి భార్య లలిత. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు. అదే కథని మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్)