
తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాన్నాళ్లుగా తెరపై కనిపించలేదు. ఇతడి లేటెస్ట్ మూవీ 'భైరవం' మే 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు ఈ హీరో ఇప్పుడు అనుకోని విషయంలో చర్చనీయాంశమయ్యాడు. రాంగ్ రూట్ లో కారు నడపడమే ఇందుకు కారణం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర రాంగ్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సదరు హీరోని నిలదీశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిర్మాత కొడుకు అయిన సాయి శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది ఓ మోస్తరు హిట్ అనిపించుకుంది. మధ్య రాక్షసుడు అనే సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఈ రెండు తప్పితే మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం 'భైరవం' కాకుండా కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవ అని మరో మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకొంటున్నాయి.
(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)
రాంగ్ రూట్ లో కార్ డ్రైవింగ్
నటుడు బెల్లంకొండ ను వెనక్కి పంపిన ట్రాఫిక్ పోలీస్..!
నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో రాంగ్ రూట్ లో కారును తీసుకెళ్లడానికి యత్నించాడు... ఈ క్రమంలో కారు అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తాకినంత పనిచేసింది..!
దీంతో… pic.twitter.com/BYcE9MA2lR— Telangana Awaaz (@telanganaawaaz) May 13, 2025