
'జబర్దస్త్' కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తొస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. సాధారణ కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం రియాలిటీ షోలకు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.
సుడిగాలి సుధీర్ తో పాటు అతడి కుటుంబం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే గతంలో తాను యాంకర్ గా చేస్తున్న టైంలో ఒకటి రెండుసార్లు కుటుంబ సభ్యులు.. షోలో కనిపించారు. అసలు విషయానికొస్తే గుడ్ న్యూస్ సుధీర్ పెళ్లి గురించి అయితే కాదు. వీళ్ల ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్-రమ్య దంపతులకు బాబు పుట్టాడు. ఈ మేరకు రోహన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్)
సుధీర్ కి తమ్ముడు, చెల్లి ఉన్నారు. రోహన్ ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండగా.. చెల్లి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సుధీర్ తమ్ముడు రోహన్ కి రమ‍్యతో పెళ్లి కాగా కొన్నేళ్ల క్రితం పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. దీంతో సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. అంతా ఓకే కానీ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేసుకుంటాడో?
సుధీర్ సినిమాల విషయానికొస్తే.. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడ్, కాలింగ్ సహస్ర అని మూవీస్ చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలారోజుల క్రితం దీన్ని ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా)