మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్ | Aamir Khan Sitaare Zameen Par Trailer | Sakshi
Sakshi News home page

Aamir Khan: ఆమిర్ కొత్త సినిమా.. మళ్లీ ట్రోలింగ్ షురూ

May 14 2025 7:24 AM | Updated on May 14 2025 8:03 AM

Aamir Khan Sitaare Zameen Par Trailer

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని మిస్టర్ ఫెర్ఫక్షనిస్ట్ అంటారు. కానీ 'దంగల్' వరకు ఓకే కానీ ఆ తర్వాత ఇతడికి దురదృష్టం మొదలైంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దాదాపు మూడేళ్ల పాటు సినిమాలే చేయని ఆమిర్.. కొత్త మూవీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.

'సితారే జమీన్ పర్' టైటిల్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇది 2023లో రిలీజైన 'ఛాంపియన్స్' అనే మూవీకి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. కొన్ని సీన్లయితే మక్కీకి మక్కీ దింపేశారు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు. మరోవైపు ఎప్పటిలానే ఆమిర్ సినిమాపై ట్రోలింగ్ షురూ అయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 

'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. షార్ట్ టెంపర్ ఉండే ఓ కోచ్ అనుకోని కారణాల వల్ల కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో సదరు జడ్జి ఊహించని తీర్పు ఇస్తారు. మతిస్థిమితం లేని కొందరిని టీమ్ గా చేసి బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. తర్వాత సదరు కోచ్ ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

మంగళవారం రాత్రి ట్రైలర్ రిలీజ్.. అప్పుడే ఆమిర్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలైంది. టర్కీ ఫస్ట్ లేడీని గతంలో ఇతడి కలిశాడని, అందుకే సినిమాని బహిష్కరించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన సుడిగాలి సుధీర్ తమ్ముడు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement