
హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. పెళ్లయిన మూడున్నర్ర సంవత్సరాల తర్వాత శుభవార్తను ప్రకటించారు. కాగా.. బాలీవుడ్ నటి పాత్రలేఖను నవంబర్ 15, 2021న రాజ్‌కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'బేబీ ఆన్ ది వే' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. రాజ్‌కుమార్ రావు గతేడాది సూపర్ హిట్ మూవీ స్త్రీ-2 చిత్రంలో నటించారు. శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు ఆయన భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను అలరించింది.