breaking news
Patralekha
-
పెళ్లిరోజే గుడ్‌న్యూస్ చెప్పిన హీరో
బాలీవుడ్ జంట రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) - పాత్రలేఖ (Patralekhaa) గుడ్‌న్యూస్ చెప్పింది. తమ పెళ్లిరోజునాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు దంపతులు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 15న రాజ్‌కుమార్- పాత్రలేఖల పెళ్లిరోజు. వెడ్డింగ్ యానివర్సరీ నాడే బిడ్డ జన్మించడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందిన వీరికి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.2014లో లవ్..రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ సిటీలైట్స్ (2014) సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు సైతం పచ్చజెండా ఊపడంతో 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 9న పాత్రలేఖ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. న్యూజిలాండ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు తాను గర్భం దాల్చిన విషయాన్ని కనుగొంది. డెలివరీ తర్వాత బిడ్డతో కలిసి న్యూజిలాండ్ ట్రిప్‌ను పూర్తి చేస్తానంది. అలాగే బిడ్డను ఎత్తుకుని బంగీ జంప్ కూడా చేస్తానంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు 2010లో రణ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. లవ్ సెక్స్ ఔర్ ధోఖా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, తలాష్, కై పో చె, సిటీ లైట్స్, హమారీ అదూరీ కహాని, స్త్రీ, లవ్ సోనియా, లూడో, హిట్: ద ఫస్ట్ కేస్, భేడియా, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలతో అలరించాడు. పాత్రలేఖ.. లవ్ గేమ్స్, నానూ కీ జాను, బద్నాం గాలి, వైల్డ్ వైల్డ్ పంజాబ్, పూలె వంటి పలు మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా? -
అమ్మాయిలూ.. ప్రెగ్నెంట్ అవడం ఈజీ!: బాలీవుడ్ నటి
అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? కష్టసుఖాల్నే కాదు ఇంటిపనినీ సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. భార్యకు అన్నివిధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రాజ్‌కుమార్ భార్య, నటి పాత్రలేఖ (Patralekha) జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ (అండాలను) భద్రపరిచింది.ప్రెగ్నెన్సీయే సులువుఈ విషయం గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను. కానీ, ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను. నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది. ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకెటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డల్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే.. అమ్మాయిలూ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవడానికి ట్రై చేయండి. కిట్‌లో నెగెటివ్ రిజల్ట్నేను సహజంగా గర్భం దాల్చాను. నిజానికి ప్రెగ్నెన్సీ కిట్‌లో కూడా నెగెటివ్ ఫలితమే చూపించింది. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్‌ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. మూడు నెలలవరకైనా ఈ విషయం బయటకు చెప్పకూడదనుకున్నాం. కానీ గతేడాది డిసెంబర్లో ఓ ఈవెంట్‌కు వస్తామని రాజ్, నేను ఓ ఈవెంట్‌కు మాటిచ్చాం. సడన్‌గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్‌లో ఆ ఈవెంట్‌కు వెళ్లాం. దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే! -
తండ్రి కాబోతున్న స్త్రీ-2 నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలిపారు. పెళ్లయిన మూడున్నర్ర సంవత్సరాల తర్వాత శుభవార్తను ప్రకటించారు. కాగా.. బాలీవుడ్ నటి పాత్రలేఖను నవంబర్ 15, 2021న రాజ్‌కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 'బేబీ ఆన్ ది వే' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ దంపతులు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. రాజ్‌కుమార్ రావు గతేడాది సూపర్ హిట్ మూవీ స్త్రీ-2 చిత్రంలో నటించారు. శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది బుల్ చుక్ మాఫ్ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా రాణించలేకపోయింది. మరోవైపు ఆయన భార్య పాత్రలేఖ గతేడాది వెల్డ్ వైల్డ్ పంజాబ్ అనే మూవీలో నటించింది. ఈ ఏడాదిలో పూలే సినిమాతో అభిమానులను అలరించింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
నా భార్య వంట చేస్తే నేను బోళ్లు తోముతా: హీరో
కష్టసుఖాల్నే కాదు, ఇంటిపనినీ సమంగా పంచుకుంటే భార్యాభర్తల మధ్య ఏ గొడవా ఉండదంటున్నాడు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao). మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా ప్రేమజంటలకు, పెళ్లి జంటలకు రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ (Patralekhaa) దంపతులు కొన్ని సూచనలిస్తున్నారు. ముందుగా పాత్రలేఖ మాట్లాడుతూ.. మా బంధంలో ఎవరి ఆధిపత్యం ఉండకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం. బాగా సర్దుతాడుచిన్నదైనా, పెద్దదైనా ప్రతీ విషయాన్ని, పనిని షేర్ చేసుకోవాలని నియమంగా పెట్టుకున్నాం. తను అన్నింటినీ చక్కగా సర్దుతాడు. ఏది ఎక్కడుందన్నది ఇట్టే చెప్పగలడు. నేను వంట చేస్తే తను పాత్రలు కడుగుతాడు. ఇలాంటి చిన్నచిన్న పనులు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఇద్దరం సమానమే అన్న భావనను మరింత పెంపొందిస్తాయి అని చెప్పుకొచ్చింది. (చదవండి: అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్)నేను బోళ్లు తోముతా..దీని గురించి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మా వైవాహిక జీవితంలో చిన్నచిన్న పనులు, సాయాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. నా భార్య వంట చేసిన తర్వాత ఎంతో ఇష్టంగా సింక్‌లోని పాత్రలు శుభ్రం చేస్తాను. ఆమె ఇంట్లో లేనప్పుడు కూడా ఈ పనులన్నీ చేస్తాను. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమంటే మన జీవితాల్ని సులభతరం చేసుకోవడమే! అని చెప్పుకొచ్చాడు. కాగా రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ సుమారు దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సిటీలైట్స్ (Citylights) మూవీ, బోస్:డెడ్/అలైవ్ వెబ్‌సిరీస్ సహా పలు ప్రాజెక్టుల్లో కలిసి పని చేశారు.చదవండి: పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్ -
తాళి, గాజులు.. అన్నీ తనకే! అందుకే పెళ్లిలో అలా చేశా..: హీరో
పెళ్లిలో భార్యతో నుదుటన సింధూరం పెట్టించుకున్నాడు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు. ఇద్దరం సమానమే అని నిరూపించడానికే ఈ పని చేశానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ.. పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఓ విషయం అర్థం కాలేదు. మంగళసూత్రం, సింధూరం, గాజులు అన్నీ పాత్రలేఖ ధరించి ఉంది. మంత్రాలకు అర్థం చెప్పమన్నా..నా వేలికి ఒక ఉంగరం మాత్రమే ఉంది. అప్పుడు తనను.. నువ్వు కూడా నా నుదుటన బొట్టు పెట్టు, అప్పుడు ఇద్దరం సమానమవుతామని చెప్పాను. నా మాటలు విని పాత్రలేఖ చాలా సంతోషించింది. అంతేకాదు పూజారి వేద మంత్రాలు చదువుతున్నప్పుడు దాని అర్థాలు కూడా విడమరిచి చెప్పమన్నాను. ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నాపై కోప్పడకూడదటఅలా ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకునే క్రమంలో కొన్ని నాకు మింగుడుపడలేదు. ఉదాహరణకు ఓ మంత్రంలో ఏమని ఉందంటే.. నా భార్య నాపై కోప్పడకూడదట! అది విని ఆశ్చర్యపోయాను. ఆ లైన్ చదివేందుకు నేను ఒప్పుకోలేదు. తనకు నచ్చినట్లుగా ఉండాలంతే అని చెప్పాను అంటున్నాడు రాజ్‌కుమార్.సినిమారాజ్కుమార్ రావు, పాత్రలేఖ 2010లో ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్లో పరిచయమ్యారు. ఆ పాట షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డారు. 2021 నవంబర్ 15న చంఢీగడ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యే మూడో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇకపోతే రాజ్‌కుమార్ రావు ఈ ఏడాది.. స్త్రీ 2, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, విక్కీ విద్యకా వో వాలా వీడియో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.చదవండి: అప్పడప్పుడు ఆ అలవాటు కూడా ఉంది.. బచ్చల మల్లి -
హీరో భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన నటి!
సెలబ్రిటీలపై రూమర్స్ రావడమనేది సహజం. వారిపై ఏదో ఒక రూమర్ రావడం.. దానికి మళ్లీ క్లారిటీ ఇవ్వడం ఇలా సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ హీరో భార్య, నటి పాత్రలేఖపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. 2021లో రాజ్ కుమార్ రావును పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.పాత్రలేఖ మాట్లాడుతూ..' నా కడుపులో ఉబ్బినట్లుగా కనిపించినప్పుడల్లా గర్భవతిని అయిపోతానా? నేను కూడా ఒక అమ్మాయినే కదా? నా జీవితంలో సంతోషంగా లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా లైఫ్ కోరుకున్న విధంగా ఉండాలనుకున్నా. అయితే మొదటి నుంచి నాపై వస్తున్న రూమర్లను నేను పట్టించుకోను. అందుకే కామెంట్స్ కూడా చదవటం మానేశా. కేవలం ఫోటోలు మాత్రమే చూస్తున్నా. నేను ఎలాంటి దుస్తులు ధరించినా మీరు ఇలానే ఊహించుకుంటారా?' అని ఘాటుగానే ప్రశ్నించింది.తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు అవాస్తమని పాత్రలేఖ కొట్టిపారేసింది. కాగా.. రాజ్ కుమార్ రావు ఇటీవలే స్త్రీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 15 ఏళ్ల డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పాత్రలేఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్'లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ?
Rajkummar Rao Shared His Back Wife Patralekhaa Impressed: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇటీవల 'బదాయి దో' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో భూమి పెడ్నేకర్‌తో తొసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజ్ కుమార్. ఈ మూవీ జాతియ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం 'బదాయి హో'కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. రాజ్ కుమార్ రావుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్డేట్ వంటి విషయాలతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా తను జిమ్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు రాజ్ కుమార్. చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ ఈ పోస్ట్ చూసిన రాజ్ కుమార్ రావు అభిమానులు అమెజింగ్, అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ రాజ్ కుమార్ రావు సతీమణి, నటి పత్రలేఖ దృష్టిని ఆకర్షించింది. ఈ జిమ్ ఫొటోకు తను స్పందిస్తూ 'హాయ్' అని రాస్తూ రెండు ఫైర్ ఎమోజీస్ను రిప్లైగా ఇచ్చింది. ఈ ఫొటోలో రెసిస్టాన్స్ బ్యాండ్‌తో రాజ్ కుమార్ చేస్తున్న వర్క్ అవుట్‌కు అతని బ్యాక్ కర్వ్ తిరిగి ఉండటం మనం చూడొచ్చు. కాగా బదాయి దో చిత్రంలో రాజ్ కుమార్ రావు బాడీ బిల్డర్‌గా మారాలనే పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించాడు. అలాగే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోలను కొల్లేజ్ రూపంలో పోస్ట్ చేశాడు రాజ్ కుమార్. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్ -
నా నుదిటిపై కూడా సింధూరం పెట్టు.. పత్రలేఖతో రాజ్ కుమార్
బీ టౌన్ కొత్త జంట రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం నవంబర్ 15న జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలోని కొన్ని మధురమైన క్షణాలను పంచుకున్నారు రాజ్ కుమార్. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. 'మా జీవితంలోని అత్యంత అందమైన రోజును మీ అందరితో పంచుకుంటున్నాను.' అంటూ రాజ్ కుమార్ చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. 'ఇదంతా 11 సంవత్సరాలైంది. కానీ నువు నాకు నా జీవితకాలం నుంచి తెలిసినట్టు అనిపిస్తుంది. ఈ ఒక్క జన్మే కాదు అనేక జన్మల నుంచి అని అనుకుంటున్నాను.' అంటూ పత్రలేఖకు రాజ్ కుమార్ చెప్తాడు. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) మరోవైపు వీడియో రాజ్ వాయిస్ ఓవర్లో 'నిజంగా చెప్పాలంటే 10-11 ఏళ్లు గడిచాయి. కానీ మేము ఇప్పుడే డేటింగ్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది. మేము ఒకరి సాంగత్యాన్ని ఒకరం చాలా ప్రేమిస్తున్నాం. భార్యాభర్తల్లాగా అలాగే చేద్దామనుకుంటున్నాం.' అని అన్నాడు. అలాగే పత్రలేఖ నుదిటిపై రాజ్ కుమార్ సింధూరం పెట్టి, తనకు కూడా అలాగే పెట్టమంటాడు. ఇది వారి సాంప్రదాయంలో భాగమట. సాధారణంగా భార్య నుదిటిపై సింధూరం పురుషులు మాత్రమే పెడతారు. చదవండి: బాలీవుడ్ కొత్త జంట వివాహ వేదిక గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ? -
బాలీవుడ్ కొత్త జంట వివాహ వేదిక గురించి ఆసక్తికర విషయాలు తెలుసా ?
Raj Kumar Rao And Patralekha Wedding Venue Intresting Facts: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు వివాహం చిరకాల ప్రేయసి పత్రలేఖతో చండీగఢ్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. నవంబర్ 15న చండీగఢ్‌లోని 'ది ఒబెరాయ్ సుఖ్ విలాస్ స్పా రిసార్టు', వీరి వివాహానికి చిరునామాగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అభిమానులను ఎంతో ప్రేమగా ఆకట్టుకున్నాయి. రాజ్ కుమార్, పత్రలేఖ వారి పెళ్లి కోసం ఎంపిక చేసుకున్న ఈ విలాసవంతమైన రిసార్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా. View this post on Instagram A post shared by The Oberoi Sukhvilas (@theoberoisukhvilas) విలాసవంతమైన 'ది ఒబెరాయ్ సుఖ్ విలాస్ స్పా రిసార్టు' 8 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాలు, నీటి వనరులతో నిండి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రిసార్ట్ హిమాలయాలకు దిగువన గ్రేట్ సిస్వాన్ అటవీకి సమీపంలో ఉంది. రిసార్ట్‌లో ప్రైవేట్ పూల్స్, ఆయుర్వేద, వెల్నెస్ ప్రోగ్రామ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. రూ. 30,500 నుంచి రూ. 6,00,000 మధ్య 5 కేటగిరీల్లో గదులను ఎంపిక చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by The Oberoi Sukhvilas (@theoberoisukhvilas) View this post on Instagram A post shared by The Oberoi Sukhvilas (@theoberoisukhvilas) View this post on Instagram A post shared by The Oberoi Sukhvilas (@theoberoisukhvilas) View this post on Instagram A post shared by The Oberoi Sukhvilas (@theoberoisukhvilas) View this post on Instagram A post shared by The Oberoi Sukhvilas (@theoberoisukhvilas) నూతన వధూవరులు రాజ్ కుమార్, పత్రలేఖ తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. 'చివరికి 11 ఏళ్ల ప్రేమ, రొమాన్స్, స్నేహం, వినోదం తర్వాత ఇవాళ నా సర్వస్వం, సోల్‌మేట్, బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నాను. నేను పత్రలేఖ భర్త అని పిలింపించుకోవడం కంటే ఆనందం మరొకటి లేదు.' అని రాజ్ కుమార్ తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. మరోవైపు పత్రలేఖ ' నా 11 ఏళ్ల బెస్ట్ ఫ్రెండ్, సోల్‌మేట్, సర్వస్వం, ప్రియుడు, అన్నింట్లో భాగస్వామిని పెళ్లి చేసుకున్నాను. మీ భార్య అనే అనుభూతి కంటే గొప్ప అనుభూతి లేదు.' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by 🌸 Patralekhaa 🌸 (@patralekhaa) చదవండి: చిరకాల ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు.. ఫోటోలు వైరల్ -
చిరకాల ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు.. ఫోటోలు వైరల్
Rajkummar Rao Marries Patralekhaa in Chandigarh: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తన చిరకాల ప్రేయసి పత్రలేఖ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా పత్రలేఖతో రాజ్ కుమార్ నవంబర్ 15న(సోమవారం) ఏడడుగులు వేశారు. వీరి వివాహ వేడుకకు చండీగఢ్ వేదికగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాజ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. చదవండి: Samantha: పుకార్లే నిజమయ్యాయి.. సమంతకు ఫస్ట్ టైమ్ ఇది రాజ్ కుమార్.. పత్రలేఖ నుదుటున కుంకుమ దిద్దుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘11 సంవత్సరాల ప్రేమ, స్నేహం, వినోదం తరువాత చివరికి ఈరోజు నా సర్వస్వం, నా సోల్మెట్, బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకన్నాను. నా సోల్మెట్, బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు పత్రలేఖ నుంచి భర్తగా పిలిపించుకోవడంకంటే గొప్ప ఆనందం మరొకటి లేదు’ అనే క్యాషన్ ఇచ్చాడు. ఈ ఫోటోలనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా కాగా రాజ్ కుమార్ రావు, ప్రతలేఖ దాదాపు పదేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. నేడు పెళ్లితో ఒకటయ్యారు. చదవండి: ఊర'నాటు' స్టెప్పులేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు నూతన జంటకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రియాంక చోప్రా, తాప్సీ, ఆయుష్మాన్ ఖురానా వంటి నటులు ‘మీ జంట చూడముచ్చటగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by 🌸 Patralekhaa 🌸 (@patralekhaa) -
రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
Raj Kumar Rao And Patralekha Marriage: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రాజ్ కుమార్ రావు, పత్రలేఖ ఇవాళ (నవంబర్ 15) పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే చండీగఢ్‌లో వీరి వివాహం జరగనున్నట్లు బి-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం వీరి కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య విరి వివాహ వేడుక జరగనుందట. కాగా ఈ జంట నవంబర్ 13న ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికి వివాహ తేదీని ప్రకటించలేదు. Everyone is invited in this beautiful wedding ceremony 🥺❤️(virtually😹) of #RajkummarRao #Patralekhaa pic.twitter.com/rXGnNhRWbn — Rajkumar Rao(Rini) (@Rajkummar_vibes) November 14, 2021 చండీగఢ్‌లోని ఒబెరాయ్ సుఖ్ విలాస్ స్పా రిసార్ట్‌లో శనివారం రాజ్ కుమార్ రావు, పత్రలేఖల నిశ్చితార్థం జరిగింది. సోమవారం(నవంబర్ 15) వివాహం సందర్భంగా వారి వెడ్డింగ్ కార్డును ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. నీలి రంగులో ఉన్న వెడ్డింగ్ కార్డ్ వధువువైపు నుంచి ఆహ్వానిస్తున్నట్లు ఉంది. షాన్డిలియర్లు, తామరలను కార్డుపై చూడొచ్చు. ఏడేళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ కుమార్ రావు, పత్రలేఖలు నేడు వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ -
బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్
బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావ్, పత్రలేఖల నిశ్చితార్థం ఇటీవల చండీగఢ్‌లో వారి సన్నిహితుల మధ్య జరిగింది. ఆ వేడుకల నుంచి అనేక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా రాజ్ కుమార్ రావు, పత్రలేఖ ఎంగేజ్మెంట్లో చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజ్ కుమార్ రావు, పత్రలేఖ జంత పూర్తిగా తెల్లని దుస్తుల్లో కనిపించారు. వైట్ అండ్ సిల్వర్ షిమ్మర్ సైడ్ స్లిట్ గౌన్‌ను పత్రలేఖ వేసుకుంటే, తెల్లటి ఇండియన్ ఫ్యూజన్ దుస్తులు ధరించారు. రాజ్ కుమార్ తన ప్రేమకు ఎంగేజ్మెంట్ రింగ్‌ను మోకాళ్లపై కూర్చొని బహుకరించాడు . తర్వాత పత్రలేఖ కూడా మోకాళ్లపై కూర్చొని రాజ్ కుమార్ వేలుకు ఉంగరాన్ని తొడిగింది. జంట ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఈద్ షెరీన్ పాడిన పర్ఫెక్ట్ సాంగ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లే అవడం ప్రారంభమైంది. దీంతో రాజ్ కుమార్, పత్రలేఖ ఇద్దరు డ్యాన్స్ చేస్తూ కనువిందు చేశారు. వారి నృత్యంతో అతిథులను అలరిస్తూ ఉత్సాహపరిచారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) మరోవైపు, వారు అతిథులతో కలిసి పోజులిచ్చిన అనేక ఫొటోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫొటల్లో ఎంగేజ్మెంట్ కోసం జంట వేసుకున్న వైట్ డ్రెస్ థీమ్‌కు అనుగుణంగా హోటల్లని వైట్ లైట్లతో అలంకరించడం చూడొచ్చు. ఈ వేడుకల్లో నటుడు సాకిబ్ సలీమ్, నిర్మాత ఫరా ఖాన్ కూడా పాల్గొన్నారు. వివాహానికి పత్రలేఖ సబ్యసాచి ఔట్‌ఫిట్‌ను వేసుకుంటుందని ఆమె స్నేహితురాలు ఒకరు చెప్పినట్టు సమాచారం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఈ సబ్యసాచి వేర్‌ను ధరించిన వారిలో దీపికా పదుకొణె, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, బిపాస బసు ఉన్నారు. 2014లో 'సిటీలైట్స్' చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకన్న ఈ జంట చాలా కాలంగా డేటింగ్లో ఉందని పుకార్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి తేది గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
వివాహం చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో.. సన్నిహితులకే ఆహ్వానం
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, నటి పత్రలేఖను పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహం వీరికి సంబంధించిన అతి సన్నిహితుల సమక్షంలో జరగనుందట. వీరి వివాహ వేడుక చండీగఢ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పత్రలేఖ కుటుంబం ఇప్పటికే చేరుకుందట. త్వరలో రాజ్ కుమార్ కుటంబం హాజరు కానుందని సమాచారం. అయితే కొవిడ్ కారణంగా వివాహాన్ని ఎలాంటి ఆర్బాటం లేకుండా, ప్రవేట్‌గా నిర్వహించాలనుకున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలోని అతి సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చాలా కాలంగా కలిసి ఉంటున్న రాజ్ కుమార్, పత్రలేఖ తమ పెళ్లి పుకార్ల గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొన్ని రోజులుగా ఈ జంట నవంబర్ 11-13 మధ్య వివాహం జరగనుందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. రాజ్ కుమార్.. పత్రలేఖను తొలిసారిగా ఒక ప్రకటనలో చూశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా తన మనసు పత్రలేఖకు ఇచ్చేశాడు. నిజ జీవితంలో ఆమెను కలవాలని గట్టిగా కోరుకున్నాడు. ఇంకే.. నెల రోజుల తర్వాత కట్ చేస్తే డైరెక్ట్‌గా ఆమెను కలుసుకున్నాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోవడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇప్పటికీ వారు ఏడేళ్లకుపైగా రిలేషన్షిప్లో ఉన్నారు. View this post on Instagram A post shared by 🌸 Patralekhaa 🌸 (@patralekhaa) పత్రలేఖ 2014లో సిటీలైట్స్లో రాజ్‌కుమార్ రావు సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సమయానికి, రాజ్‌కుమార్ విమర్శకుల ప్రశంసలు పొందిన కై పో చే!, షాహిద్, ఒమెర్టా, అలీగర్, లవ్ సోనియా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్, సెక్స్ ఔర్ ధోఖాతో రాజ్‌కుమార్ రావు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2013లో విడుదలైన కై పో చే! చిత్రంలో అతనిది అద్భుతమైన పాత్ర. షాహిద్‌లో తన పాత్రకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. రాజ్ కుమార్ చేసిన ఇటీవలి చిత్రాలు హమ్ దో హమారే దో, రూహి. -
ఏ సలహా ఇవ్వకపోవడం కూడా... సలహానే!
తొలి పరిచయం కెమెరా ముందు తొలిసారిగా నిల్చోవడానికి, తొలి సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడలేదు. భయపడలేదు. కారణం ఏమిటంటే, గతంలో నేను చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించాను. నేను షిల్లాంగ్‌లో పుట్టి పెరిగాను. అక్కడ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా నేను ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ పెరిగాను. ‘టైటానిక్’ ‘ప్రెట్టీ ఉమన్’ నా అభిమాన చిత్రాలు. నేను చూసిన తొలి హిందీ సినిమా ‘కుఛ్ కుఛ్ హోతా హై’. పోటీకి భయపడేవాళ్లు ఆటలో దిగవద్దు. దిగితే భయపడవద్దు. సినీ పరిశ్రమలోనే కాదు ప్రతిచోటా పోటీ ఉంది. ‘ఇతరులు ఏం చేస్తున్నారు?’ అనేదాని కంటే ‘నేనేం చేస్తున్నాను’ అనేదానిపైనే ఎక్కువ దృష్టి పెడతాను. షిల్లాంగ్ నేపథ్యం, సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి చిత్రం విజయం సాధించడం, నాకు గుర్తింపు రావడం... నావరకైతే అతిపెద్ద విజయాలు. ఈ సంతృప్తి చాలు. కెరీర్ మొదట్లో లభించే ప్రశంసలు జీవితకాలం గుర్తుండి పోతాయి. ‘సిటీ లైట్స్’ ప్రదర్శన తరువాత నటి అలియాభట్ నన్ను కౌగిలించుకొని చాలాసేపు మెచ్చుకోలుగా మాట్లాడింది. నాకు స్ఫూర్తి కలిగించిన నటి విద్యాబాలన్ కూడా నన్ను మెచ్చుకున్నారు. షబానా ఆజ్మీ కూడా. ఈ ప్రశంసలతో సంతోషం కంటే ‘బాధ్యత’ ఎక్కువ పెరిగింది. ‘కొత్తనటిని కదా. ఏదైనా సలహా చెప్పండి’ అని ఒక నటుడిని అడిగితే ‘ఏ సలహా ఇవ్వక పోవడం కూడా సలహానే’ అన్నారు నవ్వుతూ. అంతేనేమో! - పత్రలేఖ, హీరోయిన్ (సిటీలైట్స్ ఫేమ్) -
విద్యా మమ్మీనే నాకు స్పూర్తి!
ముంబై: హన్సల్ మెహతా తాజాగా తీస్తున్న సిటీ లైట్స్ ద్వారా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న పత్రలేఖకు ప్రముఖ నటి విద్యాబాలన్ అంటే ఇష్టమట. ఆమెనే స్పూర్తిగా తీసుకునే తాను ఈ రంగంలో ముందుకు వెళతానని ఢంకా బజాయించీ మరీ చెబుతుంది ఈ చిన్నది. ' విద్యా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నటించిన సినిమాలనే ఎక్కువగా చూస్తుంటాను. 2005 లో వచ్చిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ నటనకు ఫిదా అయిపోయా. అప్పట్నుంచీ ఆమెనే అనుసరిస్తూ ఉంటానని' తెలిపింది. విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్స్, కహానీ వంటి చిత్రాలు మాదిరి తాను కూడా విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు మనసులో మాటను బయటపెట్టింది. ఇదిలా ఉండగా ఈ మధ్యే విద్య తన భర్తతో కలిసి ఓ స్టూడియోలో సిటీ లైట్స్ చూసి.. పత్రలేఖ నటనకు కితాబు ఇచ్చింది. ఇక సిటీ లైట్స్‌లో హీరో రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఈమె కనిపిస్తోంది. వీళ్లిద్దరూ ఇందులో రాజస్థాన్ గ్రామీణ దంపతులుగా కనిపిస్తారు. బ్రిటిష్ సినిమా మెట్రో మనీలా ఆధారంగా దీనిని తీస్తున్నారు. ఇది ఒక సామాన్యుడి గురించి వివరించే సినిమాగా రూపొందినట్టు టాక్. -
ఎంతో కష్టపడ్డా
తన మాదిరే కూతురు కూడా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా పనిచేసి పేరు తెచ్చుకోవాలని తండ్రి కోరుకున్నా, పత్రలేఖ మాత్రం సినిమాలపై దృష్టి పెట్టింది. హన్సల్ మెహతా తాజాగా తీస్తున్న సిటీ ఆఫ్ లైట్స్ ద్వారా ఈమె బాలీవుడ్లో అడుగుపెడుతోంది. బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ అందగత్తె సినిమాల్లో అవకాశం సంపాదించుకోవడానికి ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. ‘నేను సీఏ చదవాలని మా నాన్న కోరుకునేవారు. నేనేమో సినీ లోకాల్లో విహరించేదాన్ని. నా కలను సాకారం చేసుకోవడానికి నటనా శిక్షణ తరగతులకు వెళ్లేదాన్ని. వర్క్‌షాప్‌లలోనూ పాల్గొనేదాన్ని. చాలా ఆడిషన్లకూ వెళ్లాను’ అని చెప్పిన పత్రలేఖ... షిల్లాంగ్‌లో పుట్టినా ముంబైలోనే డిగ్రీ పూర్తి చేసింది. ఇక సిటీ ఆఫ్ లైట్స్‌లో హీరో రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఈమె కనిపిస్తోంది. వీళ్లిద్దరూ ఇందులో రాజస్థాన్ గ్రామీణ దంపతులుగా కనిపిస్తారు. బ్రిటిష్ సినిమా మెట్రో మనీలా ఆధారంగా దీనిని తీస్తున్నారు. ‘ఇది ఒక సామాన్యుడి గురించి వివరించే సినిమా. నేను అలాంటి దానినే. రాజస్థాన్ నాకు పూర్తిగా కొత్త కాబట్టి అక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు చాలా కష్టపడ్డా. షూటింగ్ కోసం అక్కడ మూడు వారాలు ఉన్నాం. స్థానికులతో మాట్లాడి వాళ్ల పద్ధతులు, భాష, ఆహార అలవాట్ల గురించి తెలుసుకున్నాను. రాజస్థానీ సంప్రదాయ ఆహారం దాల్ బటీ చుర్మా నాకు చాలా ఇష్టం’ అని ఈమె వివరించింది. మెట్రో నగరాల్లో గ్రామీణ ప్రాంతాల వలస ప్రజలు దోపిడీ గురికావడాన్ని హృద్యంగా వివరించే సిటీ లైట్స్ ఈ నెల 30న థియేటర్లకు రానుంది. ‘పొట్టకూటి కోసం వేలాదిమంది నగరాలకు వస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మెట్రో నగరాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ఈ సినిమా చూపిస్తుంది. ఇది పూర్తిగా ఆధునిక భారత సినిమా’ అని పత్రలేఖ చెప్పింది. అన్నట్టు ఈ బ్యూటీ ‘డకేర్ షాజ్’ అనే బెంగాలీ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది.


