పెళ్లిరోజే గుడ్‌న్యూస్‌ చెప్పిన హీరో | Actors Rajkumar Rao, Patralekha Welcomes Baby Girl on Wedding Anniversary | Sakshi
Sakshi News home page

4వ పెళ్లిరోజు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి

Nov 15 2025 9:56 AM | Updated on Nov 15 2025 11:08 AM

Actors Rajkumar Rao, Patralekha Welcomes Baby Girl on Wedding Anniversary

బాలీవుడ్‌ జంట రాజ్‌కుమార్‌ రావు (Rajkummar Rao) - పాత్రలేఖ (Patralekhaa) గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ పెళ్లిరోజునాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు దంపతులు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్‌ 15న రాజ్‌కుమార్‌- పాత్రలేఖల పెళ్లిరోజు. వెడ్డింగ్‌ యానివర్సరీ నాడే బిడ్డ జన్మించడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందిన వీరికి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2014లో లవ్‌..
రాజ్‌కుమార్‌ రావు- పాత్రలేఖ సిటీలైట్స్‌ (2014) సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు సైతం పచ్చజెండా ఊపడంతో 2021 నవంబర్‌ 15న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 9న పాత్రలేఖ తాను ప్రెగ్నెంట్‌ అన్న విషయాన్ని వెల్లడించింది. న్యూజిలాండ్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు తాను గర్భం దాల్చిన విషయాన్ని కనుగొంది. డెలివరీ తర్వాత బిడ్డతో కలిసి న్యూజిలాండ్‌ ట్రిప్‌ను పూర్తి చేస్తానంది. అలాగే బిడ్డను ఎత్తుకుని బంగీ జంప్‌ కూడా చేస్తానంది.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. రాజ్‌కుమార్‌ రావు 2010లో రణ్‌ మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. లవ్‌ సెక్స్‌ ఔర్‌ ధోఖా, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ 2, తలాష్‌, కై పో చె, సిటీ లైట్స్‌, హమారీ అదూరీ కహాని, స్త్రీ, లవ్‌ సోనియా, లూడో, హిట్‌: ద ఫస్ట్‌ కేస్‌, భేడియా, శ్రీకాంత్‌, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలతో అలరించాడు. పాత్రలేఖ.. లవ్‌ గేమ్స్‌, నానూ కీ జాను, బద్నాం గాలి, వైల్డ్‌ వైల్డ్‌ పంజాబ్‌, పూలె వంటి పలు మూవీస్‌ చేసింది.

 

 

చదవండి: కల్యాణ్‌, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement