
అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? కష్టసుఖాల్నే కాదు ఇంటిపనినీ సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. భార్యకు అన్నివిధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రాజ్‌కుమార్ భార్య, నటి పాత్రలేఖ (Patralekha) జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ (అండాలను) భద్రపరిచింది.
ప్రెగ్నెన్సీయే సులువు
ఈ విషయం గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను. కానీ, ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను. నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది. ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకెటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డల్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే.. అమ్మాయిలూ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవడానికి ట్రై చేయండి.
కిట్‌లో నెగెటివ్ రిజల్ట్
నేను సహజంగా గర్భం దాల్చాను. నిజానికి ప్రెగ్నెన్సీ కిట్‌లో కూడా నెగెటివ్ ఫలితమే చూపించింది. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్‌ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. మూడు నెలలవరకైనా ఈ విషయం బయటకు చెప్పకూడదనుకున్నాం. కానీ గతేడాది డిసెంబర్‌లో ఓ ఈవెంట్‌కు వస్తామని రాజ్, నేను ఓ ఈవెంట్‌కు మాటిచ్చాం. సడన్‌గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్‌లో ఆ ఈవెంట్‌కు వెళ్లాం. దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది.
చదవండి: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే!