
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ ఫ్లాట్ అమ్మేసింది. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ను గత నెలలో విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్‌ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్‌ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. మలైకా అరోరా చయ్య చయ్య పాటతో సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్‌లో తళుక్కుమన్న ఆమె తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్‌తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్‌లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.
థామాలో స్పెషల్ సాంగ్
ప్రస్తుతం రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న థామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మ్యాడ్‌డాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్‌లో నాలుగో చిత్రంగా ‘థామా’ తెరకెక్కుతోంది.