హీరో కూతురికి నామకరణం.. సాక్షాత్తూ అమ్మవారి పేరు! | Rajkummar Rao, Patralekhaa Reveals Their Daughter Name | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ జంటకు పెళ్లిరోజే కూతురి జననం.. ఏం పేరు పెట్టారంటే?

Jan 18 2026 1:08 PM | Updated on Jan 18 2026 1:26 PM

Rajkummar Rao, Patralekhaa Reveals Their Daughter Name

బాలీవుడ్‌ జంట రాజ్‌కుమార్‌ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్‌ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు. తాజాగా తమ ఇంట్లోకి సంతోషాల మూటను తీసుకొచ్చిన చిన్నారి చేతి ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పాపకు "పార్వతి పాల్‌ రావు" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట​! ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 

2021లో పెళ్లి
రాజ్‌ కుమార్‌ రావు- పాత్రలేఖ ఇద్దరూ సినిమా యాక్టర్సే. 2014లో సిటీలైట్స్‌ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ రానురానూ మరింత బలపడింది. పెద్దలు కూడా వారి ప్రేమాయణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 2021 నవంబర్‌ 15న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది న్యూజిలాండ్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు పాత్రలేఖకు తాను గర్భవతిని అన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే భారత్‌ తిరిగొచ్చేసిది. అయితే బిడ్డ పుట్టాక మళ్లీ న్యూజిలాండ్‌ ట్రిప్‌కు వెళ్లి ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టేస్తానంటోంది.

సినిమా
రాజ్‌ కుమార్‌ రావు.. 2010లో సినీ జర్నీ మొదలుపెట్టాడు. రణ్‌, లవ్‌ సెక్స్‌ ఔర్‌ ఢోకా, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ 2, స్త్రీ. తలాష్‌, లవ్‌ సోనియా, హిట్‌, శ్రీకాంత్‌, భేడియా, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. పాత్రలేఖ విషయానికి వస్తే.. ఈమె లవ్‌ గేమ్స్‌, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె వంటి పలు చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement