
చిన్నపిల్లలు, టీనేజ్ యువకులు ఎవరైనా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎక్కువగా హీరోల స్టైల్స్నే ఫాలో అవుతుంటారు. ఆ హీరో స్టైల్లో కటింగ్ చేయమని సెలూన్ వాళ్లను అడిగి మరీ తమ అభిమాన హీరోలా తయారవుతారు. అందుకే ఏ సెలూన్ షాప్‌ల ముందైనా హీరోల హెయిర్ కట్స్తోనే పోస్టర్స్ పెడతారు. అలా ఓ హీరోను చూసి ఎంతో యూత్ అచ్చం అలానే ఉండాలని ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. ఆ హీరో ఎవరో మీకు గుర్తున్నారా? 1990ల్లో ఓ యూత్ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు. ఒకప్పుడు హెయిర్ కట్ స్టెల్‌కు బ్రాండ్గా మారిన ఆయన ఇప్పుడు గుర్తుపట్టలేరేమోనని అనిపిస్తోంది. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలనుందా?అయితే ఈ స్టోరీ చదివేయండి.
ఆయనే మరెవరో కాదు.. ప్రేమదేశం హీరో అబ్బాస్.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990ల్లో పుట్టిన కుర్రాళ్లను అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అప్పట్లో ఆయన నటించిన సూపర్ హిట్ లవ్స్టోరీ మూవీ 'ప్రేమదేశం' చూసి అచ్చం అబ్బాస్ లాగే హెయిర్ స్టైల్ చేయించుకున్నారు యూత్ ఆడియన్స్. అతడిలా ఉండటానికి ఎంతోమంది ట్రై చేశారు. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.
తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన వాళ్లు అసలు అబ్బాసేనా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతలా మారిపోయింది మరి ఆయన కటౌట్. తెల్లటి గడ్డం, స్టైలిష్ హెయిర్ లుక్‌లో అచ్చం అప్పటిలాగే ఉన్నప్పటికీ గుర్తుపట్టడానికి కాస్తా టైమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటి అబ్బాస్ లవర్ బాయ్‌లా ఉంటే.. ఇప్పటి అబ్బాస్ కాస్తా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఏదేమైనా యూత్ హెయిర్ కట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అబ్బాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు..
అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో న్యూజిలాండ్లోని కుటుంబం దగ్గరికి వెళ్లిపోయిన అబ్బాస్.. పెట్రోల్ బంక్ లో పనిచేయడం లాంటి జాబ్స్ చేశాడు. ప్రస్తుతం కార్పొరేట్ ఫీల్డ్‌లో సెటిలయ్యాడు. అయితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానిని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్ మళ్లీ చెన్నై వచ్చాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. తెలుగులో నీ ప్రేమకై, రాజా, శ్వేతనాగు, రాజహంస, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో అబ్బాస్ నటించారు.