ఆమిర్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్ | Sitaare Zameen Par Movie Telugu Trailer Released Trending On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Sitaare Zameen Par Telugu: 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ చూశారా?

Jun 11 2025 9:32 AM | Updated on Jun 11 2025 10:33 AM

Sitaare Zameen Par Trailer Telugu

'లాల్ సింగ్ చద్దా' లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'సితారే జమీన్ పర్' పేరుతో తీసిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.

(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?)

హాలీవుడ్ మూవీ 'ఛాంపియన్స్'కి అనధికారిక రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్.. అనుకోని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో మూడు నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని వాళ్లకు కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఆర్డర్ వేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒప్పుకొంటాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వాళ్లతోనే టోర్నీలో విజయాలు సాధిస్తాడు. ఇదే స్టోరీలా అనిపిస్తుంది.

ఆమిర్ స్వయంగా కోచ్‌గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మకుండా.. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తానని కొన్నిరోజుల క్రితమే ప్రకటించాడు. అలానే రీసెంట్‌గా పలువురు సెలబ్రిటీల కోసం 'సితారే జమీన్ పర్' ప్రీమియర్ వేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమిర్ మూవీ అంటే నెటిజన్ల నుంచి విమర్శలు సాధారణం. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!)

Advertisement
 
Advertisement
Advertisement