
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో యాక్షన్ సినిమాతో అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న యాక్షన్ చిత్రం సర్‌జమీన్. కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్‌గా నటించింది.
తాజాగా సర్‌జమీన్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. ఈ నెల 25 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు.
Yahaan har faisla ek kurbani hai, desh ki ya apno ki… kuch aisi Sarzameen ki kahaani hai🇮🇳#Sarzameen, releasing July 25, only on #JioHotstar#SarzameenOnJioHotstar@PrithviOfficial @itsKajolD #IbrahimAliKhan #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @AndhareAjit @kayoze… pic.twitter.com/qMDDJA19Vq
— JioHotstar (@JioHotstar) July 4, 2025