కూతురిగా చేసిన నటితో రొమాన్స్.. డైరెక్టర్‌ వద్దని చెప్పారు: అమిర్ ఖాన్ | Aamir Khan Responds on romancing with Fatima Sana Shaikh in after Dangal | Sakshi
Sakshi News home page

Aamir Khan: 'దంగల్ నటితో రొమాన్స్'.. డైరెక్టర్‌తో ఆ విషయం చెప్పా: అమిర్ ఖాన్

Jul 2 2025 5:35 PM | Updated on Jul 2 2025 5:52 PM

Aamir Khan Responds on romancing with Fatima Sana Shaikh in after Dangal

ఆమిర్ ఖాన్ ఇటీవలే 'సితారే జమీన్ పర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా దేశ్‌ముఖ్‌ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే గతంలో అమిర్ ఖాన్‌ నటించిన దంగల్ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో  ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించింది.

అయితే దంగల్‌లో అమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత 2018లో వచ్చి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అమిర్ ఖాన్‌ కలిసి రొమాన్స్ చేసింది. అయితే తన కూతురి పాత్రలో నటించిన ఆమెతో అమిర్ ఖాన్ రొమాన్స్ చేయడంపై తాజాగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సినిమా మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉండదని థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డైరెక్టర్‌ విజయ్ కృష్ణ ఆచార్య అన్నారని గుర్తు చేశారు. 

అయితే తనకు  ప్రేమికుడిగా నటించడానికి ఫాతిమాకు ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్‌తో ‍చెప్పానని అమిర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే నేను ఆమె తండ్రిగా ఒక సినిమాలో మాత్రమే నటించా.. నిజ జీవితంలో కాదని డైరెక్టర్‌తో చెప్పినట్లు తెలిపారు. నేను నిజ జీవితంలో ఆమె ప్రియుడిని కాదు.. మేమిద్దరం కలిసి కేవలం సినిమా చేస్తున్నామని దర్శకుడితో చెప్పినట్లు వివరించారు. అంతే కాకుండా గత సినిమాల్లో తల్లి-కొడుకులుగా నటించిన అమితాబ్ బచ్చన్- వహీదా రెహ్మాన్‌లు.. ఆ తర్వాత  ప్రేమికులుగా నటించారని అమిర్ గుర్తు చేశారు. దీపిక, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి తారలు ఈ మూవీని రిజెక్ట్‌ చేసినప్పటికీ ఫాతిమా ఈ చిత్రానికి సంతకం చేశారని అమిర్ ఖాన్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన సినిమా అని నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి కాల్ వచ్చిన తర్వాత తాను షాక్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'  బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement