breaking news
Dangal Cinema
-
కూతురిగా చేసిన నటితో రొమాన్స్.. డైరెక్టర్ వద్దని చెప్పారు: అమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ ఇటీవలే 'సితారే జమీన్ పర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే గతంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ కూతురిగా మెప్పించింది.అయితే దంగల్‌లో అమిర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత 2018లో వచ్చి థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ కలిసి రొమాన్స్ చేసింది. అయితే తన కూతురి పాత్రలో నటించిన ఆమెతో అమిర్ ఖాన్ రొమాన్స్ చేయడంపై తాజాగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సినిమా మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ యాంగిల్ ఉండదని థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య అన్నారని గుర్తు చేశారు. అయితే తనకు ప్రేమికుడిగా నటించడానికి ఫాతిమాకు ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్‌తో చెప్పానని అమిర్ ఖాన్ వెల్లడించారు. ఎందుకంటే నేను ఆమె తండ్రిగా ఒక సినిమాలో మాత్రమే నటించా.. నిజ జీవితంలో కాదని డైరెక్టర్‌తో చెప్పినట్లు తెలిపారు. నేను నిజ జీవితంలో ఆమె ప్రియుడిని కాదు.. మేమిద్దరం కలిసి కేవలం సినిమా చేస్తున్నామని దర్శకుడితో చెప్పినట్లు వివరించారు. అంతే కాకుండా గత సినిమాల్లో తల్లి-కొడుకులుగా నటించిన అమితాబ్ బచ్చన్- వహీదా రెహ్మాన్‌లు.. ఆ తర్వాత ప్రేమికులుగా నటించారని అమిర్ గుర్తు చేశారు. దీపిక, ఆలియా భట్, శ్రద్ధా కపూర్ లాంటి తారలు ఈ మూవీని రిజెక్ట్ చేసినప్పటికీ ఫాతిమా ఈ చిత్రానికి సంతకం చేశారని అమిర్ ఖాన్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన సినిమా అని నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి కాల్ వచ్చిన తర్వాత తాను షాక్ అయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. -
దంగల్ @ 2000 కోట్లు... నాటౌట్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడీ స్థానాన్ని హిందీ చిత్రం ‘దంగల్’ దక్కించుకుంది. రూ. 2,000 కోట్లు వసూళ్లు సాధించి, ఎక్కువ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా వరల్డ్‌లో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘దంగల్’. ఇటీవల చైనాలో ఈ చిత్రాన్ని ‘షుయి జియావో బాబా’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ మాత్రమే ఈ చిత్రం 1,200 కోట్లు రాబట్టింది. దాంతో ‘బాహుబలి’ రికార్డుని బీట్ చేసింది. ఇంకా ఈ సినిమా చైనాలో విజయవంతంగా దూసుకెళుతోందట. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి–2’ని వచ్చే నెల చైనాలో విడుదల చేయనున్నారు. మరి.. ఈ చిత్రం అక్కడ సాధించే వసూళ్లను బట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఏది? అనేది డిసైడ్ అవుతుంది. ‘ఇండియన్ సినిమా నంబర్ వన్’ రికార్డు గురించి పక్కన పెడితే ‘దంగల్’ చైనీస్ కలెక్షన్స్ హాలీవుడ్ సినిమాలకు షాక్ ఇచ్చాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అయిన ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘ట్రాన్స్ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్’, ‘కుంగ్‌ఫూ ఫాండా’, ‘ది జంగిల్‌బుక్’లతోపాటు వరల్డ్ సూపర్‌హిట్ మూవీ ‘అవతార్’కు మించిన వసూళ్లను చైనా బాక్సాఫీసు వద్ద ‘దంగల్’ రాబట్టుకోవడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాన్–ఇంగ్లీష్ మూవీగా ఐదో స్థానం దక్కించుకుంది. అక్కడ మిగతా నాలుగు స్థానాల్లో నిలిచిన నాన్–ఇంగ్లీష్ చిత్రాలు ఏంటంటే... ‘ది మెర్మైడ్’ (చైనా), ‘మాన్స్టర్ హాంట్’ (చైనా), ది ఇన్టచ్బుల్స్(ఫ్రాన్స్), యువర్ నేమ్ (జపాన్). ఐదో స్థానంలో ఇండియన్ మూవీ ‘దంగల్’ ఉండటం గర్వించదగ్గ విషయం. గ్రేట్ రెజ్లర్ మహావీర్‌సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్షన్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.