అనుకున్నదే జరిగింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన సృష్టి ఎలిమినేట్ అయింది. ఈమెతో పాటు చరణ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కానీ తక్కువ ఓట్లు పడిన కారణంగా సృష్టి బయటకొచ్చేసింది. ఇంతకీ ఈమె ఎలిమినేషన్‌కి కారణాలేంటి? నాలుగు వారాలకుగానూ రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు గెలుచుకుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా 'మండాడి'.. అధికారిక ప్రకటన)
మోడల్‌గా తెలిసిన సృష్టి.. ఈ ఏడాది అగ్నిపరీక్షలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. జడ్జిల మనసు గెలుచుకుని బిగ్‌బాస్ 10వ సీజన్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. ముఖ్యంగా నామినేషన్స్ టైంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెకు తక్కువ ఓట్లు పడేలా చేశాయి. అలా ఈ వారం నామినేట్ అయి ఎలిమినేట్ కూడా అయిపోయింది.
సుధీర్‌తో ఈమెకు జరిగిన గొడవ ఎలిమినేషన్‌కి ప్రధాన కారణమని చెప్పొచ్చు. నామినేషన్ టైంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో సృష్టి అతిగా ప్రవర్తించింది. సుధీర్‌పై చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఈమెపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. అలా తక్కువ ఓట్లు పడి బయటకొచ్చేసింది. ఇక నాలుగు వారాలుపాటు హౌస్‌లో ఉన్నందుకుగానూ వారానికి రూ.75 వేల చొప్పున రూ.3 లక్షలు.. అలానే అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకుగానూ రూ.50 వేలు.. మొత్తంగా రూ.3.5 లక్షలు ఈమె సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్.. మాస్క్ వీరులు వీళ్లే.. సండే హైలెట్స్ ఇవే..!)


