బిగ్‌బాస్ 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో నాలుగో వారం చివరకొచ్చేసింది. గతవారం మిథిలేష్.. రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడంతో ఎలిమినేషన్ జరగలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా ఒకరు బయటకెళ్లిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే డేంజర్ జోన్లో ఇద్దరు కామనర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అవ్వొచ్చు? చివరి స్థానాల్లో ఎవరున్నారు?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్)ఈ వారం నామినేషన్లలో మొత్తంగా తొమ్మిది మంది ఉన్నారు. త్రిగుణ్, రోహిత్, ముఖేశ్, చరణ్, నరేశ్, షాలిని, దేబ్జానీ, అమన్, సృష్టిలలో ప్రస్తుతం సృష్టి-చరణ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారిక ఓటింగ్‌లోనూ వీళ్లే చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంటున్నారు గానీ అలాంటిదేం జరగకపోవచ్చు. వినిపిస్తున్న టాక్ ప్రకారం సృష్టి.. హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నారు. చరణ్ మెడపై కూడా కత్తి వేలాడుతోంది.ఈ వారం 'టోటల్ డామినేషన్' థీమ్ పెట్టారు కాబట్టి, ఎలిమినేషన్ ప్రక్రియలోనూ ఈ థీమ్‌నే జోడించే అవకాశమైతే ఉంది. మరి చరణ్, సృష్టిలో ఎవరు బయటకెళ్లిపోతారు? ఎవరు బతికిపోతారనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాలి. ఇకపోతే ఈ వారం అపూర్వ కెప్టెన్సీ చేయగా.. తాజాగా అమన్ ఈ అధికారాన్ని దక్కించుకున్నాడు. కానీ తన దగ్గరున్న పవర్ ఉపయోగించుకున్న వర్షిణి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంది.(ఇదీ చదవండి: కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?)