డాక్టరేట్ షావుకారు జానకి.. అసలు ఆమె ఏం చదివారో తెలుసా? | Sowcar Janaki Education Details Go Viral: Actress Studied Only Matriculation | Sakshi
Sakshi News home page

Sowcar Janaki: డాక్టరేట్ షావుకారు జానకి.. ఆమె ఏం చదివారో తెలుసా?

Aug 21 2026 4:57 PM | Updated on Aug 21 2026 4:59 PM

Sowcar Janaki Education Details Inside goes Viral

ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, డాక్టరేట్స్ కూడా అందుకున్నారు. రెండు నంది అవార్డులతో పాటు భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ కూడా ఆమెను వరించింది. అలా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న జానకి.. చదవింది కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమేనని తెలుస్తోంది.

గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన జానకి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు ఎన్నో డాక్టరేట్స్ వచ్చినప్పటికీ నేను కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమే చదువుకున్నానని తెలిపింది. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో చదివినట్లు పేర్కొంది. ఆమె చదివింది కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమే అయినప్పటికీ.అరిజోనా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ అందుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement