ఫ్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి మరణవార్తపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆమె మనల్ని విడిచివెళ్లడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఆమెను కోల్పోవడం మనకు తీరని లోటు అన్నారు. జానకమ్మ సినీ ప్రయాణం, ఆమె పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.
షావుకారు జానకి గారి మరణం ఎంతో బాధాకరమని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ ఆదర్శంగా నిలిచిపోతాయని తెలిపారు. నేటి యువత ఆమె ఎంత గొప్ప వ్యక్తిత్వమో తప్పక తెలుసుకోవాలని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇక లేరనే వార్త ఎంతో బాధ కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె మృతి పట్ల తన సంతాపం ప్రకటంచారు. షావుకారు చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగిందని తెలిపారు. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి అని కొనయాడారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
షావుకారు జానకి అమ్మగారి మరణవార్త విని ఎంతో బాధపడ్డానని నటి రాధిక శరత్ కుమార్ అన్నారు. ఆమె దృఢ సంకల్పం కలిగిన, స్వతంత్ర భావాలున్న, కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నా తండ్రి శ్రీ రాధా గారికి సన్నిహిత మిత్రురాలిగా ఉంటూ.. పరస్పరం ఎంతో గౌరవాభిమానాలు కలిగి ఉన్న ఆమెతో పరిచయం, కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని అన్నారు.
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏— Jr NTR (@tarak9999) August 21, 2026


