పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ | Kerintha Actress Sukrithi Ambati Welcomes Baby Boy, Shares Good News With Fans, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sukrithi: మగబిడ్డ పుట్టాడు.. 'కేరింత' హీరోయిన్ పోస్ట్ వైరల్

Aug 21 2026 6:45 AM | Updated on Aug 21 2026 11:01 AM

Kerintha Movie Actress Sukrithi Blessed Baby Boy

తెలుగులో 'కేరింత' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసిన సుకృతి తల్లయింది. మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ మేరకు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుకుంటున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్‌లోనూ ఆసక్తి చూపించేది. అలా దిల్ రాజు నిర్మించిన 'కేరింత'లో భావన పాత్ర కోసం ఎంపికైంది. ఈ మూవీ హిట్ అయినా సరే అవకాశాలు రాలేదో ఆసక్తి లేదో తెలియదు గానీ మరో మూవీ చేయలేదు. యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.

ఇక నాలుగేళ్ల క్రితం అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చిన సుకృతి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. ఇప్పుడు తనకు మగబిడ్డ పుట్టాడని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement