breaking news
Sukrithi Ambati
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో 'కేరింత' అనే సినిమాలో హీరోయిన్గా చేసిన సుకృతి తల్లయింది. మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ మేరకు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుకుంటున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్‌లోనూ ఆసక్తి చూపించేది. అలా దిల్ రాజు నిర్మించిన 'కేరింత'లో భావన పాత్ర కోసం ఎంపికైంది. ఈ మూవీ హిట్ అయినా సరే అవకాశాలు రాలేదో ఆసక్తి లేదో తెలియదు గానీ మరో మూవీ చేయలేదు. యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.ఇక నాలుగేళ్ల క్రితం అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చిన సుకృతి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో తను ప్రెగ్నెన్సీతో ఉన్న సంగతి బయటపెట్టింది. ఇప్పుడు తనకు మగబిడ్డ పుట్టాడని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) -
'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)
-
శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'కేరింత' సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సుకృతి ఇప్పుడు శుభవార్త చెప్పేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని సంగతి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త)ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుతున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్‌కి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేది. అలా దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో భావన అనే పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంతో మంచి గుర్తింపే వచ్చినప్పటికీ ఏ భాషలోనూ మరో మూవీ చేయలేదు. పూర్తిగా యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఓవైపు జాబ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని రివీల్ చేసింది. బీచ్ ఒడ్డున్న బేబీ బంప్‌తో దిగిన ఫొటోలని ఈ సందర్భంగా షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi)


