శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్ | Kerintha Movie Actor Sukrithi Ambati Announce Pregnancy | Sakshi
Sakshi News home page

Sukrithi: పెళ్లయిన నాలుగేళ్లకు గుడ్ న్యూస్.. పోస్ట్ వైరల్

Apr 24 2026 6:13 PM | Updated on Apr 24 2026 6:21 PM

Kerintha Movie Actor Sukrithi Ambati Announce Pregnancy

'కేరింత' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుకృతి ఇప్పుడు శుభవార్త చెప్పేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని సంగతి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.

(ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త)

ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుతున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్‌కి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేది. అలా  దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో భావన అనే పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంతో మంచి గుర్తింపే వచ్చినప్పటికీ ఏ భాషలోనూ మరో మూవీ చేయలేదు. పూర్తిగా యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.

2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఓవైపు జాబ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని రివీల్ చేసింది. బీచ్ ఒడ్డున్న బేబీ బంప్‌తో దిగిన ఫొటోలని ఈ సందర్భంగా షేర్ చేసింది.

(ఇదీ చదవండి: ‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement