ద్రోహం : ఆ ఏడుగుర్ని గుర్తుపెట్టుకుంటాం! | Gave Everything To Raghav Chadha He Ended Up In BJP Lap AAP | Sakshi
Sakshi News home page

ద్రోహం : ఆ ఏడుగుర్ని గుర్తుపెట్టుకుంటాం!

Apr 24 2026 4:48 PM | Updated on Apr 24 2026 5:47 PM

Gave Everything To Raghav Chadha He Ended Up In BJP Lap AAP

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్‌ చద్దా రాజీనామా చేయడం సంచలనం రేపింది. వరుసగా ఏడుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు రాఘవ్ చద్దా శుక్రవారం చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది. దీనిపై తొలిసారిగా ఆప్‌ ఘాటుగా స్పందించింది.  పార్టీకి, ప్రజలకు వారు తీరని ద్రోహం చేశారంటూ మండిపడింది.

రాఘవ్‌ చద్దా ప్రకటన తరువాత విలేకరుల సమావేశం నిర్వహించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వారు పార్టీకి, పంజాబ్ ప్రజలకు "ద్రోహం" చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపీగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బీజేపీ పంచన చేరారని విమర్శించారు.

'ఆపరేషన్ లోటస్' సిగ్గు చేటు

పంజాబ్‌ ప్రభుత్వంపై 'ఆపరేషన్ లోటస్' అమలు జరుగుతోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆపరేషన్ లోటస్ అమలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ఆపరేషన్ లోటస్‌ను అమలు చేయడానికి ED, CBI సంస్థలను వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ ద్రోహులను పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని AAP ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు బీజేపీ అడ్డుపడుతోందని సంజయ్ సింగ్  విమర్శించారు. బీజేపీలో చేరుతున్న ఏడుగురినీ గుర్తుంచుకుంటామనీ,  ముఖ్యంగా పంజాబ్ ప్రజలు వారిని ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: 3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్‌ మేనేజర్‌

Advertisement
 
Advertisement
Advertisement