గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్‌టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి
ఏం జరిగింది అంటే?
ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్‌టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్‌గా మారింది.
నెటిజన్ల స్పందన
ఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు.
అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్
నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్‌తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం.
After being abused for the past two years bro recorded these clips on his laptop
Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026


