‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు | Actor Rajasekhar Responds Tagore Movie Issue | Sakshi
Sakshi News home page

Rajasekhar: రాజశేఖర్ చేయాల్సిన 'ఠాగూర్'.. అలా చిరంజీవి చేతుల్లోకి

Apr 24 2026 5:22 PM | Updated on Apr 24 2026 5:25 PM

Actor Rajasekhar Responds Tagore Movie Issue

'ఠాగూర్' పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తారు. ఇందులో ఆయన చెప్పిన డైలాగ్స్, అద్భుతమైన యాక్టింగ్ మరోసారి మదిలో మెదులుతాయి. చెప్పాలంటే చిరు కెరీర్‌లోనే మైలురాయి లాంటి సినిమా ఇది. ‍అయితే ఇదో రీమేక్ అని చాలామందికి తెలీదు. అలానే రాజశేఖర్ చేయాల్సిన ఈ మూవీ.. చిరంజీవి చేతుల్లోకి వచ్చిందనే సంగతి కూడా ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడీ విషయంపై స్వయంగా రాజశేఖర్ స్పందించారు. అప్పట్లో ఏం జరిగిందో బయటపెట్టారు.

(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

''ఠాగూర్' నేను కొనుక్కున్న సినిమా. అడ్వాన్స్ అంతా ఇచ్చేశా. నిర్మాత నా ఫ్రెండే కదా అని ‍అగ్రిమెంట్ చేసుకోలేదు. ఠాగూర్ మధు ఉన్నారు కదా! చిరంజీవి కోసం ఆయన వెళ్లి, ప్రొడ్యూసర్‌ని కలిసి ఎక్కువ డబ్బులిస్తానని చెప్పి పట్టుకెళ్లిపోయారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఇవ్వలేదు. ఇది జరిగింది' అని రాజశేఖర్ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

శంకర్ దర్శకత్వంలో అర్జున్ చేసిన 'జెంటిల్మన్' సినిమా కూడా తానే చేయాలని.. కానీ 'అల్లరి ప్రియుడు' షూటింగ్ టైంలోనే ఆ అవకాశం రావడంతో తప్పక వదులుకున్నానని రాజశేఖర్ చెప్పారు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీలో తెర వెనక చాలా జరుగుతుంటాయి. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లాంటివి లేకపోవడం నిజాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఈయనే చెప్పడంతో జరిగింది ఇది అని అందరికీ క్లారిటీ వచ్చింది.

తమిళంలో విజయకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో 'రమణ' సినిమా వచ్చింది. ఇది బ్లాక్‌బస్టర్ కాగా తెలుగులో దీన్నే 'ఠాగూర్'గా రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. సూపర్‌హిట్‌గా నిలిచింది. ఒకవేళ ఇది రాజశేఖర్ చేసుంటే ఎలా ఉండేదో మరి?

(ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement