గత నెలలో రిలీజైన 'ధురంధర్ 2' సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ మూవీ గురించి మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో నటించిన రాకేశ్ బేడీ.. నిర్మాతల నుంచి రూ.కోటి గిఫ్ట్ అందుకోవడమే దీనికి కారణం. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: ‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ)
'ధురంధర్' మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోగా.. గత నెలలో రిలీజైన రెండో భాగంలో హీరో రణ్‌వీర్ సింగ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే చివరలో రాకేశ్ బేడీ చేసిన జమీల్ జమాలీ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. అప్పటివరకు పాక్ రాజకీయ నాయకుడి పాత్రనే అని అంతా అనుకున్నారు. కానీ ఇతడు కూడా భారతదేశ్ గూఢచారి అనేది సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. హీరో, విలన్ తదితరులని ఎంతలా మెచ్చుకున్నారో.. రాకేశ్ బేడీకి కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.
రెండు భాగాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించిన రాకేశ్ బేడీకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ అని ముందే మాట్లాడుకున్నారు. అది చెల్లించేశారు కూడా. కానీ ఇప్పుడు సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకనిర్మాత ఆదిత్యధర్.. ఈయనకు అదనంగా రూ.కోటి రూపాయల చెక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. 'ధురంధర్ 2' కలెక్షన్స్ ప్రస్తుతం రూ.1800 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు)


