తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. రజనీకాంత్, ధనుష్, త్రిష, మణిరత్నం, అజిత్, శృతీహాజన్‌తో పాటు పలువురు తమిళ స్టార్స్ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.
టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."
He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026


