పోలింగ్ బూత్ వద్ద పేలుడు.. ప్రాణభయంతో పరుగులు | Bomb Attack Disrupts Polling In Murshidabad During First Phase Of Elections, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పోలింగ్ బూత్ వద్ద పేలుడు.. ప్రాణభయంతో పరుగులు

Apr 23 2026 11:12 AM | Updated on Apr 23 2026 11:27 AM

Crude bomb hurled in Murshidabads Nowda

ముర్షిదాబాద్‌: పశ్చిమ బెంగాల్ తొలి విడత ఎన్నికల పోలింగ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఉత్సాహంగా సాగుతున్న ప్రజాస్వామ్య పండుగలో కలకలం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ జిల్లాలోని నవ్‌దా ప్రాంతంలో ఓటర్లు బారులు తీరిన సమయంలో దుండగులు నాటు బాంబులతో విరుచుకుపడటం ఆందోళనకు దారితీసింది.

బాంబుల దాడి
గురువారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, నవ్‌దాలోని ఓటింగ్ కేంద్రం సమీపంలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ హఠాత్పరిణామంతో ఓటర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పోలింగ్ ప్రక్రియకు ఒక్కసారిగా తీవ్ర ఆటంకం ఏర్పడింది.
 

రంగంలోకి భద్రతా దళాలు
ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి సంఖ్య, తీవ్రతపై అధికారులు ఇంకా వెల్లడించలేదు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎక్కడా ఏమీ జరగలేదని ముర్షిదాబాద్ ఏఎస్పీ మజిద్ ఖాన్ విలేకరులతో పేర్కొనడం గమనార్హం.
 

152 స్థానాలు.. ఉత్కంఠ పోరు
తొలి విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది సుమారు 3.22 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికార పీఠం దక్కించుకుంటారా? లేదా బీజేపీ  అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది ఈ రెండు విడతల ఎన్నికల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement