VTV Ganesh
-
విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్ ‘విజిల్’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్ విక్టరీని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్.విజయే సీఎం..ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ.. తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..వీటీవీ గణేష్ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’ అంటూ ఓ సినిమాలో గణేష్ చెప్పిన డైలాగ్స్‌ని కోట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. This Actor Confidence on #Vijay's Victory before result... ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ #TVKVijay #TVKVijayHQ pic.twitter.com/jlueARDA12— Rajesh Manne (@rajeshmanne1) May 4, 2026 -
నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు: వీటీవీ గణేష్
తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. రజనీకాంత్, ధనుష్, త్రిష, మణిరత్నం, అజిత్, శృతీహాజన్‌తో పాటు పలువురు తమిళ స్టార్స్ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026 -
తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు
సినిమా నటీనటులు కొన్నిసార్లు మాట్లాడే మాటలు అతిశయోక్తిలా అనిపిస్తుంటాయి. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అయినా సరే హీరోలని పొగిడే క్రమంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఫేమస్ కమెడియన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)తమిళనాడులో వస్త్రదుకాణాలతో గుర్తింపు తెచ్చుకున్న శరవణనన్.. నాలుగేళ్ల క్రితం 'లెజెండ్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సదరు హీరో యాక్టింగ్‌పై అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు 'లీడర్' అనే మూవీతో వస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ఆడియో-ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులోనే కమెడియన్ వీటీవీ గణేశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గనక నచ్చితే సులభంగా రూ.1000 కోట్లు వచ్చేస్తాయని అనడం చిత్రంగా అనిపించింది.రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలే ఇప్పటివరకు రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకోలేకపోయారు. అలాంటిది లెజెండ్ శరవణనన్ సినిమాకు ఇన్ని కోట్ల వసూళ్లు వస్తాయని కమెడియన్ పొగడటం కాస్త అతిలా ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. తొలి చిత్రంతో తీవ్రంగా నష్టపోయిన శరవణనన్.. ఈసారి 'లీడర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇందులో పాయర్ రాజ్‌పుత్ హీరోయిన్ కాగా ఆండ్రియా, శ్యామ్, లాల్ తదితర స్టార్స్ ఉన్నారు. (ఇదీ చదవండి: రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్) -
ఒక్క డైలాగ్‌తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!
కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్ (VTV Ganesh). టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. కెవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19న విడుదల కానుంది.ఒక్క డైలాగ్‌తో పాపులర్ఈ మూవీ ప్రెస్మీట్లో గణేశ్ మాట్లాడుతూ.. బీస్ట్ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ అనే ఒక్క డైలాగ్‌తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్ సర్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్ మూవీ తెలుగు ట్రైలర్లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈజీగా తప్పించుకుంటారునాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే, నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్.. తెలుగులో భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్' మూవీస్‌తోనూ అలరించాడు.చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్'


