ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత | Bikaji Foods founder Chairman Shiv Ratan Agarwal passes away | Sakshi
Sakshi News home page

Shiv Ratan Agarwal ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత

Apr 23 2026 4:05 PM | Updated on Apr 23 2026 5:14 PM

Bikaji Foods founder Chairman Shiv Ratan Agarwal passes away

బీకాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఈరోజు (ఏప్రిల్ 23, గురువారం) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను కంపెనీ వెల్లడించ లేదు. 

బికాజీ ఫుడ్స్, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, సాంప్రదాయ స్నాక్స్, స్వీట్స్ విభాగంలో కంపెనీని ఒక గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో అగర్వాల్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. భుజియా, నమ్‌కీన్, ప్యాకేజ్డ్ స్వీట్స్ మరియు 'రెడీ-టు-ఈట్' విభాగాల్లో బీకాజీని అగ్రగామిగా నిలబెట్టారంటూ ఆయనకు నివాళులర్పించింది. వ్యవస్థాపకుని ఆశయాలకు అనుగుణంగా సంస్థను నడుపుతామని, వ్యాపార స్థిరత్వాన్ని కొనసాగిస్తామని కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు ప్రకటించారు. సెబీ నిబంధనల ప్రకారం, ఆయన మరణం తర్వాత ప్రమోటర్ గ్రూపులో ఆయన సభ్యత్వం ముగుస్తుందని కంపెనీ తెలిపింది.

బీకాజీ ఫుడ్స్ నేపథ్యం:
భారతదేశంలోని ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో బీకాజీ ఫుడ్స్ ఒక ప్రముఖ సంస్థ. పట్టణీకరణ,  బ్రాండెడ్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఈ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశీయ మార్కెట్‌తో పాటు, విదేశాల్లో ఉన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా కూడా తన ఉనికిని చాటుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement