ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ వేదిక చర్చల్లో కూడా సందిగ్ధత నెలకొంది. సీజ్‌ఫైర్‌ను ట్రంప్ పొడిగించినప్పటికీ అరకొరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, ఇరాన్ సైతం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరోవైపు.. ఇరాన్‌పై దాడుల కారణంగా అమెరికా ఆయుధాల సంఖ్య రోజురోజుకి తరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్‌లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది. ఇంతకీ అమెరికా వద్ద ఇంకా ఎన్ని క్షిపణులు, ఆయుధాలు ఉన్నాయనే అంశం ఓ నివేదిక బయటకు వచ్చింది.
అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆయుధ నిల్వలు భారీగా తరిగిపోయాయి. అయితే, అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

అమెరికా ఆయుధ నిల్వల పరిస్థితి..
టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు: యుద్ధానికి ముందు 3,100 ఉండగా.. యుద్ధం కోసం 850 వినియోగించబడ్డాయి. దీంతో, దాదాపు 25% నిల్వలు తగ్గాయి.
JASSM (జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండాఫ్ మిసైళ్లు): 4,400 ఉండగా.. ఇరాన్ యుద్ధం కోసం 1,000 వినియోగించబడ్డాయి.
THAAD ఇంటర్‌సెప్టర్లు: 360 ఉండగా.. 190–290 వినియోగించబడ్డాయి. ఇప్పుడు 70 మాత్రమే మిగిలి ఉన్నాయి.
పాట్రియట్ PAC-3: 2,330 ఉండగా.. 1,060–1,430 వినియోగించబడ్డాయి. కేవలం 900 మాత్రమే మిగిలాయి.
SM-6: 600 ఉండగా..200 వినియోగించారు. 400 వరకు ఉన్నాయి.
SM-3: 150 ఉండగా.. 40 వరకు వినియోగం. ఇంకా 110 మిగిలి ఉన్నాయి.
భవిష్యత్తు ప్రణాళిక.. భారీగా ఖర్చు..
2027 బడ్జెట్‌లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.
టోమాహాక్: 55 నుంచి 785కి పెంపు( ఒక్క దానికి ఖర్చు: తయారీకి $2.6 మిలియన్ డాలర్లు).
Patriot PAC-3: 357 నుంచి 3,203కి పెంపు ( $3.9 మిలియన్)
THAAD: 55 నుంచి 857కి పెంపు($15.5 మిలియన్)
SM-6: 166 → 540కి పెంపు($4.3 మిలియన్)
SM-3: 12 → 136కి పెంపు($9–10 మిలియన్)
ప్రధాన సమస్యలు..
ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా వినియోగింపజేస్తున్నాయి.
THAAD, Patriot లాంటి రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.
ఉత్పత్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కారణం (టోమాహాక్ – 47 నెలలు, THAAD – 53 నెలలు, SM-36 నెలలు, SM-36 నెలలు) కావడంతో నిల్వలను తిరిగి భర్తీ చేయడం కష్టతరం అవుతుంది.

ఇదే సమయంలో ఇరాన్ మాత్రం.. యుద్ధంలో ప్రధానంగా షాహెడ్ డ్రోన్లు మరియు క్రూయిజ్ మిసైళ్లు వినియోగిస్తోంది. ఇవి తక్కువ ఖర్చుతో, పెద్ద సంఖ్యలో తయారు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటంతో అమెరికా మరియు మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. ఇరాన్ ఒకేసారి వందల డ్రోన్లను పంపి, అమెరికా THAAD మరియు Patriot వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి.
ఇరాన్ ఉపయోగిస్తున్న డ్రోన్లు
Shahed-136 ("కమికాజే" డ్రోన్)
ఒకే దిశలో దాడి చేసే UAV (Unmanned Aerial Vehicle).
ఖర్చు: సుమారు $20,000–$50,000 మాత్రమే.
లక్ష్యం: శత్రు రక్షణ వ్యవస్థలను అధిక సంఖ్యలో దాడులతో అలసటకు గురి చేయడం.
“పేదవాడి క్రూయిజ్ మిసైల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో క్రూయిజ్ మిసైల్ లాంటి ప్రభావం చూపుతుంది.
UAE రక్షణ శాఖ ప్రకారం, యుద్ధం ప్రారంభం నుండి 941 డ్రోన్లు గుర్తించబడ్డాయి, వాటిలో 65 UAEలో పడిపోయి మౌలిక వసతులకు నష్టం కలిగించాయి.
Shahed-131 / Shahed-238 (అప్‌గ్రేడ్ వెర్షన్లు)
Shahed-136 కంటే చిన్నవి లేదా వేగవంతమైనవి.
కొన్ని జెట్-ఇంజిన్ ఆధారిత డ్రోన్లు కూడా వినియోగించబడ్డాయి, ఇవి మరింత వేగంగా ఉండి Patriot లాంటి రక్షణ వ్యవస్థలకు సవాలు విసురుతున్నాయి.
ఇరాన్ క్రూయిజ్ మరియు బాలిస్టిక్ మిసైళ్లు
1. Zolfaghar బాలిస్టిక్ మిసైల్
700 కిమీ పరిధి.
1,100 పౌండ్ల వార్‌హెడ్ మోసే సామర్థ్యం.
ఇరాక్‌లోని ఎర్బిల్ ప్రాంతంలో పలు దాడుల్లో వినియోగించబడింది.
2. Soumar క్రూయిజ్ మిసైల్
రష్యా KH-55 ఆధారంగా అభివృద్ధి చేయబడింది.
దీర్ఘదూర దాడులకు ఉపయోగపడుతుంది.
3. Quds-1 / Quds-2 క్రూయిజ్ మిసైళ్లు
తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే సామర్థ్యం.
గల్ఫ్ ప్రాంతంలోని మౌలిక వసతులపై దాడులకు వినియోగించబడ్డాయి.
ఇదిలా ఉండగా.. అమెరికా పెంటగాన్ ఇంటెలిజెన్స్ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్‌బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది.


