విజయవాడ కోర్టు.. ఊపిరి పీల్చుకున్న లాయర్లు | Lawyers Struck In Lift For One Hour At Vijayawada Civil Courts Complex, Rescued After 90 Minutes | Sakshi
Sakshi News home page

విజయవాడ కోర్టు.. ఊపిరి పీల్చుకున్న లాయర్లు

Apr 23 2026 12:13 PM | Updated on Apr 23 2026 1:30 PM

Lawyers Struck In Lift For one Hour At Vijayawada

సాక్షి, విజయవాడ: విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్‌లో లిఫ్ట్‌ మొరాయించడంతో గంటన్నర పాటు న్యాయవాదులు అందులోనే ఇరుక్కుపోయారు. దీంతో, వారంతా అస్వస్థతకు గురయ్యారు.

వివరాల ప్రకారం.. విజయవాడలోని సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ లిఫ్ట్‌ బ్లాక్‌లో న్యాయవాదులకు చేదు అనుభవం ఎదురైంది. న్యాయవాదులు లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో పవర్‌ కట్‌ అయింది. దీంతో, లిఫ్ట్‌ ఎనిమిదో ఫ్లోర్‌లో ఆగిపోయింది. ఈ క్రమంలో న్యాయవాదులు గంటన్నర పాటు లిఫ్టులోనే ఇరుక్కుపోయారు. అనంతరం, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్య్కూ టీమ్‌ లిఫ్ట్ లోపల ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్న వారికి ఆక్సిజన్ పంపించారు. అనంతరం, లిప్ట్‌ నుంచి బయటకు వచ్చాక లాయర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement