భార్య వైద్య అవసరాల కోసం నానా పాట్లు డుతోంటే భర్త ఏకంగా రూ. 19 కోట్లను దాచిపెట్టి, తనకు కనీసం 35 వేలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టాడని ఒక మహిళ వాపోయిన వైనం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం,తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లుగా సుమారు 14 మిలియన్ యువాన్లను (దాదాపు రూ.19 కోట్లు) రహస్యంగా ఉంచాడని చైనాకు చెందిన 53 ఏళ్ల మహిళ గుర్తించింది.
ఒక పక్క తాను దాదాపు రూ. 95వేల వైద్య బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, ఆయన మాత్రం విలాసంగా జీవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఆస్తులన్నింటినీ రహస్యంగా ఉంచాడనిఆరోపించింది. విడాకుల ప్రక్రియ సమయంలో ఆర్థిక రికార్డులను పరిశీలించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. తన ఆదాయాన్నిగానీ, ఆస్తులను గానీ ఎపుడూ వెల్లడించలేదని వాపోయింది. ఇంతకాలం అవగాహన లేక అతని ఆస్తిపాస్తులపై పట్టించుకోలేదని వాపోయింది.
వైద్య ఖర్చులకు ఇబ్బందులు
ఇంత సంపద దాచిపెట్టినప్పటికీ, తన భర్త కనీస ఆర్థిక సాయం చేయడానికి కూడా నిరాకరించాడని వాంగ్ ఆరోపించింది. తనకు నెలకు ఇవ్వాల్సిన 2,500 యువాన్ల (సుమారు రూ.35,000) అలవెన్స్‌ను ఇచ్చేందుకు నిరాకరించాడని, అలాగే తన వైద్య చికిత్సకు ఒక్క రూపాయికూడా సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. బీజింగ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో చాలా పొదుపుగా జీవించాల్సి వచ్చిందని. అద్దె తక్కువ ఇంట్లో ఉంటూ, చౌక ధరల బట్టలు ధరిస్తూ , వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో తన భర్త మాత్రం బ్రాండెడ్ వస్తువులు, కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడని ఆమె ఆరోపించింది.
గృహహింస, శారీరక దాడి
ఈ కేసులో తీవ్రమైన గృహహింస ఆరోపణలు మరో ముఖ్యమైన అంశం. భర్త చేతిలో పదేళ్ల పాటు శారీరక హింసను భరించింది. ఆమె కొట్టిన దెబ్బలు పక్కటెముకలు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన 100 కి పైగా ఫోటోలను ఆమె ఆధారాలుగా చూపించింది. ఈ శారీరక హింస , ఆర్థిక నియంత్రణ వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్‌కు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


