స్పెయిన్‌లోకి 60,000 మంది ప్రవేశం.. ఆ తర్వాత ఏమైంది? | 60000 Crossed Into Spain In 2 Days: What Happened To Them Next | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లోకి 60,000 మంది ప్రవేశం.. ఆ తర్వాత ఏమైంది?

Aug 1 2026 6:52 PM | Updated on Aug 1 2026 7:22 PM

60000 Crossed Into Spain In 2 Days: What Happened To Them Next

మొరాకో నుండి దాదాపు 60,000 మంది వలసదారులు స్పెయిన్‌ భూభాగం సెయుటా (Ceuta)నగరంలోకి ప్రవేశించిన రెండు రోజుల తర్వాత.. వారందరూ దాదాపుగా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. ఐరోపాకు చేరుకోవడానికి ప్రయత్నించే వలసదారులకు సెయుటా చాలాకాలంగా ఒక గమ్యస్థానంగా ఉంది. భారీ సంఖ్యలో ఒక్కసారిగా తరలిరావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

అయితే, స్పెయిన్ భద్రతా దళాల పటిష్ఠ చర్యలు, ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా వీరిలో సుమారు 45 వేల మంది కొన్ని గంటల్లోనే వెనుదిరిగారు. అప్పటికే సరిహద్దు దాటిన వారికి సరైన ఆహారం, వసతి లభించడం లేదన్న సమాచారంతో చాలామంది నగరంలోకి ప్రవేశించడం అసాధ్యమని గ్రహించారు. ఈ ఉద్రిక్తతల క్రమంలో జరిగిన తొక్కిసలాట, నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాల్లో 67 మంది మృతి చెందారు.

పొరుగునే ఉన్న మొరాకో నుండి సెయుటాలోకి ప్రవేశించడానికి సుమారు 1,800 మంది బ్రేక్‌వాటర్ చుట్టూ ఈదుకుంటూ వెళ్లిన వారం రోజుల తర్వాత ఈ అనధికార వలస జరిగింది. స్పెయిన్‌ భూభాగాన్ని చేరుకునే లక్ష్యంతో కొందరు వలసదారులు ముందే ఈత నేర్చుకున్నారని ఒక మొరాకో ఈత శిక్షకుడు ఫైనాన్షియల్ టైమ్స్‌తో తెలిపారు. ఈ సంఘటనకు ముందు కొందరు ఫేస్‌బుక్ గ్రూపులలో వెట్‌సూట్లు, ఫ్లిప్పర్లను అమ్మకానికి పెట్టారు. మరికొందరు సముద్రపు పరిస్థితుల గురించి అరబిక్ భాషలో సమాచారాన్ని, సెయుటాలోని తారాజల్ బీచ్‌ను ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్స్, స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసుకున్నారు.

సెయుటాలో పర్యటించిన ప్రధాని పెడ్రో సాంచెజ్ మాట్లాడుతూ.. ఈ వలసదారుల సంక్షోభానికి అక్రమ రవాణా ముఠాలే కారణమన్నారు. ఈ సంఘటనను స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడంగా అభివర్ణించిన సాంచెజ్,.. జూన్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వలసదారులు స్వార్థపూరితంగా అర్థం చేసుకున్నారని అది దావానలంలా వ్యాపించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement