మహిళల కోసం రాపిడో కొత్త అడుగు..! | Rapido Bike Pink: Women Riders Empowering Women With Safe Rides | Sakshi
Sakshi News home page

మహిళల కోసం రాపిడో కొత్త అడుగు..!

Jul 30 2026 12:47 PM | Updated on Jul 30 2026 12:51 PM

Rapido Bike Pink: Women Riders Empowering Women With Safe Rides

సాక్షి,చెన్నై :  తమిళనాడులో రాపిడో పింక్‌ మోబిలిటీ చొరవ కింద అందుబాటులోకి వచ్చిన బైక్‌ పింక్‌  ఫీచర్‌ మహిళలకు స్వతంత్ర ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, మహిళా ప్రయాణికుల నిత్య జీవిత ప్రయాణాలను అత్యంత సురక్షితంగా మారుస్తున్నది. గిగ్‌ ఎకానమీ మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, ఆర్థిక స్వాతం్రత్యాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఎంతోమంది మహిళలు తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఈ విజయం వెనుక చెన్నైకి చెందిన రాపిడో బైక్‌ పింక్‌ కెపె్టన్లు మహాలక్ష్మి రామలింగం, కె. భువనేశ్వరిలు తమ పయనం గురించి స్థానికంగా మీడియా ముందు ఉంచారు. 

రాత్రి వేళల్లో మహిళలకు అభయం: 
గత రెండేళ్లుగా రాపిడో బైక్‌ పింక్‌ కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నానని మోగప్పేర్‌కు  చెందిన  మహాలక్ష్మి రామలింగం పేర్కొన్నారు.రాత్రి 9 గంటల నుండి ఒంటి గంట వరకు కోయంబేడు బస్సు టెరి్మనల్, పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ వంటి రద్దీ ప్రాంతాల నుండి ప్రయాణించే మహిళలకు తాను  సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాపిడోలో చేరడానికి ముందు  ఆత్మరక్షణ విద్యలను నేర్చుకున్నట్టు పేర్కొన్నారు. 

మరోకెప్టెన్‌ బి. భువనేశ్వరి స్పందిస్తూ,  ఇన్‌స్ట్రాగామ్‌ పేజీ  ద్వారా గిగ్‌ వర్కర్‌ సరికొత్త అవకాశాలను, డ్రైవింగ్‌ నైపుణ్యాల ద్వారా లభించే ఆర్థిక స్వాతం్రత్యాన్ని డిజిటల్‌ మాధ్యమంలో తాను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు.  రాపిడో పింక్‌ మోబిలిటీ సాధిస్తున్న సామాజిక మార్పునకు , మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని దర్పణంగా , తోటి మహిళలో ఆత్మ విశ్వాసం నింపడమే లక్ష్యంగా వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement