బెంగళూరు: మహిళను అసభ్యకరంగా మాట్లాడిన బైకిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరం కృష్ణరాజపురం పరిధిలోని రామమూర్తి నగర్‌లో ఒక మహిళ క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి ‘మీ రేటు ఎంత’ అని అడిగాడు. ఆ మహిళ ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ‘నేను క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా, స్కూటీపై ఉన్న ఒక వ్యక్తి నా రేటు ఎంత అని అడిగాడు. నా భద్రత కోసం నేను వీడియో తీస్తున్నాను.
అది గమనించిన ఆ వ్యక్తి నన్ను తిట్టి పారిపోయాడు’ అని పేర్కొంది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని 42 ఏళ్ల విజయ్ రాఘవ్‌గా గుర్తించారు. అతను పండ్ల వ్యాపారి, హోరమావు నివాసి. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, స్కూటర్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు రామమూర్తి నగర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అతను వేరొకరి స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాడని తెలిపారు.
A woman was waiting by the roadside for a cab in Bengaluru when a man on a scooty approached her.
MAN: I’ll give you ₹10,000. Come with me to a hotel room.
WOMAN: What? Why the f*uck are you asking me? I’ll file a police complaint.
MAN: Why would you file a police complaint?… pic.twitter.com/bz26WFsDV4— Lakshay Mehta (@lakshaymehta08) July 28, 2026


