breaking news
Rakesh Bedi
-
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
ప్రముఖ నటుడి భార్య మోసపోయింది. తెలిసి తెలిసి లక్షల రూపాయలు పోగొట్టేసుకుంది. అయితే కొన్ని నెలల ముందు భర్త ఇలానే మోసపోగా.. ఇప్పుడు అతడి భార్యకు ఇలానే జరిగింది. అయితే తెలిసి మరీ ఇలా జరగడం నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు? అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)బాలీవుడ్లో నటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్ బేడీ.. 1979 నుంచి సినిమాలు, 1984 నుంచి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు. అయితే గతేడాది డిసెంబరులో ఈ నటుడిని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. రాకేశ్‌కి చెందిన ఫ్లాట్ కొంటానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి రూ.85 వేలు డబ్బు తన అకౌంట్లోకి వచ్చేలా చేసి మోసం చేశాడు.ఇప్పుడు నటుడు రాకేశ్ బేడీ భార్యకు అలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన బ్యాంక్ ఖాతాలోని రూ.5 లక్షలు.. మీ ఖాతాలో జమ అయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఆరాధనకు చెప్పాడు. మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే ఆ డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ అయిపోతాయని అన్నాడు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన ఈమె ఫోన్ కట్ చేసేసింది. కానీ ఈమె ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఈమె సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. అయితే ఇలా నెలల వ్యవధిలో ప్రముఖ నటుడి దంపతులు సైబర్ మోసానికి గురవడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్) -
లవ్లీ ఎఫెక్షన్
హావభావాలు... గిలిగింతలు పెడతాయి. డైలాగులు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నవ్వుల రారాజు... ఢిల్లీ రాజు... ఎవరికి తోచినట్టు వారు ప్రేమగా పిలుచుకొంటారతడిని.రంగస్థలంసై ఉన్నా... వెండి తెరపై మెరిసినా... బుల్లి తెరపై ఇంట కనిపించినా... హాస్యపు జల్లులు కురుస్తాయి. సుతిమెత్తని కామెడీతో... మదిమదినీ మురిపిస్తున్న హాస్యనటుడు రాకేష్బేడీ. సినిమాలు, టీవీ నటుడిగా బిజీగా ఉన్నా...తనను నిలబెట్టిన రంగస్థలాన్ని మాత్రం ఆయన ఇప్పటికీ వదల్లేదు. నాటకాల్లో నటిస్తూ... అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన రాకేష్ ఇటీవల ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్లో భాగంగానగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో ఆయన ‘చిట్‌చాట్’... రుచికరమైన ఆహారం... మాట్లాడే భాష... ప్రజల స్నేహపూర్వక స్వభావం... హైదరాబాద్ నగరంలో నాకు బాగా నచ్చే అంశాలివి. ఇక్కడి వారు హిందీ, ఇంగ్లిష్ మాట్లాడే తీరు బాగుంటుంది. వారి మాటల్లో లవ్లీ ఎఫెక్షన్ కనిపిస్తుంది. అందుకే ఈ సిటీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినా వదులుకోను. సిటీజనులు నన్నో గొప్ప నటుడిలా చూస్తున్నారు. వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రేక్షక దేవుళ్లకు కోటి దండాలు. తొలి సారి... తొలిసారి హైదరాబాద్‌కు ‘ఏక్ దూజే కేలియే’ హిందీ చిత్రం షూటింగ్ కోసం వచ్చా. ఇక అక్కడి నుంచి వస్తూనే ఉన్నా. 1979తో సహాయనటుడుగా సినీ కేరీర్ ప్రారంభించా. ఎన్నో టీవీ సీరియల్స్ చేశా. 150పై బడి సినిమాల్లో నటించాను. రంగస్థలం మీద ప్రదర్శనలైతే లేక్కే లేదు. యువత నటన వైపు... నేటి తరంలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. చూస్తే చాలు... ఏదైనా చేసేసే టైపు. శ్రమను నమ్ముకుని పట్టుదలగా ముందుకు సాగితే అవకాశాలు వాతంటవే మన తలుపు తడతాయి. ఇప్పుడు ఒక విషయం గురించిన సమాచారం కావాలంటే... నెట్లో కావల్సినంత సమాచారం చిటికెలో దొరుకుతుంది. టాలెంట్‌ను ప్రదర్శించుకోవడానికి బోలెడన్ని ప్రసార మాధ్యమాలు. నటుడిగా రాణించాలంటే సెల్ఫ్ డిసిప్ల్లిన్, నిరంతర అధ్యయనం ఉండాలి.