‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్‌ క్లారిటీ | Deepika Padukone Getting Replaced In Allu Arjun Raaka, Team Respond | Sakshi
Sakshi News home page

‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్‌ క్లారిటీ

Apr 23 2026 1:00 PM | Updated on Apr 23 2026 1:07 PM

Deepika Padukone Getting Replaced In Allu Arjun Raaka, Team Respond

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపికపై రకరకాల రూమర్స్‌ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఆమె ఒప్పుకున్న ‘రాకా’ మూవీ నుంచి కూడా తప్పుకున్నట్లు సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా ఈ పుకార్లపై ‘రాకా’ టీమ్‌ స్పందించింది. దీపికను తొలగించారనే వార్తల్లో నిజం లేదని టీమ్‌ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలిసిన తర్వాత ఆమె పాత్ర నిడివిని తగ్గించారనే ప్రచారాన్ని కూడా టీమ్‌ ఖండించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని.. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే షూటింగ్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో దీపిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయట. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్‌ సీన్స్‌ చేసేందుకు దీపిక ఒప్పుకుందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్‌ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపికతో పాటు రష్మిక, జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్‌ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.

బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇప్పటికే విలన్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. త్వరలోనే హీరో పాత్రకు సంబంధించిన లుక్‌ కూడా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. హీరో పాత్రలో బన్నీ స్టైలీష్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement