ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు హైలైట్స్..
ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం.
- మంత్రులతో సబ్ కమిటీ లేదా కమిటీ వేసే యోచనలో సర్కార్.
- నేటి కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటన ఉండే అవకాశం.
- ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం
ఆర్టీసీ సమ్మె.. పోలీసుల కీలక ఆదేశాలు
- ఆర్టీసీ కార్మికుల సమావేశాలకు కన్వెన్షన్ సెంటర్లు ఇవ్వొద్దని పోలీసుల ఆదేశం.
- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనుమతి లేదు: వికారాబాద్ పోలీసులు
- సమ్మెకు సహకరిస్తే చర్యలు తప్పవు.

నిజామాబాద్..
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 645 బస్సులకు గాను 206 నడుస్తున్న బస్ సర్వీసులు
- పోలీసులు పహారాలో అద్దె బస్సులతో నడుపుతున్న ఆర్టీసీ యాజమాన్యం
- నేటి నుండి నిరవధిక దీక్షలు చేస్తామని ప్రకటించిన కార్మిక సంఘాలు
- ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్న యాజమాన్యం
మహబూబాబాద్ జిల్లా..
- మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట మహబూబాబాద్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.
- డిపో నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులు.
- పోలీసుల బందోబస్తు నడుమ కదిలిన బస్సులు.
- బస్టాండ్‌కి చేరుకుంటూన్న ప్రయాణికులు.
- పోలీస్ వలయంలో మహబూబాబాద్ బస్టాండ్.
- హన్మకొండ, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు.
- ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్.
జనగామ జిల్లా
- జనగామ ఆర్టీసీ డిపో వద్ద హృదయవిదారక దృశ్యాలు.
- జనగామలో పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు.
- సమ్మెలో భాగంగా బస్సులను అడ్డుకున్న కార్మికులు.
- పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు.
- తమ పొట్ట కొట్టొద్దంటూ కొందరు కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కి ప్రాధేయపడటం అక్కడి వారిని కలిచివేసింది.
- ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
- పోలీసులు వారిని సముదాయించి బందోబస్తు మధ్య బస్సులను పంపించారు.
సూర్యాపేట జిల్లా
- బస్ డిపో ఎదుట పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం.
- పోలీస్ పహారాలో డిపో నుంచి బస్సులను బయటకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న కార్మికులు
- సమ్మె చేస్తుండగా బస్సులను ఎలా బయటకు తీసుకెళ్లారంటూ కార్మికుల ఆందోళన
బస్సుకో కానిస్టేబుల్
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన యాజమాన్యం
- అద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించే ప్రయత్నం
- అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు
- పోలీసుల భద్రత మధ్య నడుస్తున్న బస్సులు
- బస్సుకో కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయిస్తున్న వైనం
కరీంనగర్ జిల్లా
- రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..
- ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో మొత్తం వెయ్యి బస్సులకు గాను డిపోలకే పరిమితమైన సగానికి పైగా బస్సులు
- ప్రైవేట్ డ్రైవర్లతో ప్రధాన రూట్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
- మరికొన్ని ఊళ్లకు బస్సులు లేక, ఉన్నా సరిపడా రాకపోవడంతో బస్టాండ్లలో ప్రయాణీకుల నిరీక్షణ
- ఆర్టీసీ ఉద్యోగులు వర్సెస్ సర్కార్ ప్రతిష్ఠంభనతో ప్రయాణీకుల ఇక్కట్లు.
- ఆర్టీసీ సమ్మెతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాహనాల దందా.
- అధిక ధరలు వసూళ్లు.
సూర్యాపేట జిల్లా :
- రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
- సూర్యాపేట డిపో ఎదుట బైటాయించి కార్మికుల ధర్నా
- బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

కొనసాగుతున్న సమ్మె..
- తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.
- ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.
- వీలైనన్ని ఎక్కవ బస్సులు నడుపుతున్నామంటున్న అధికారులు.
- ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లు, తాత్కాలిక డ్రైవర్ల సమీకరణ.
- సిబ్బందిని అడ్డుకుంటే పీడీపీపీ చట్టం కింద కేసులు.
నల్లగొండ జిల్లా
- మిర్యాలగూడలో రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
- ఔట్ సోర్సింగ్ సిబ్బందితో బస్సులను నడిపిస్తున్న అధికారులు
- బస్టాండ్‌లో భారీగా మోహరించిన పోలీసులు
- బస్టాండ్ వద్దకు చేరుకొని ఆందోళనలకు దిగిన కార్మికులు
హైదరాబాద్..
- నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ..
- ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్న కేబినెట్..
- ఇందిరమ్మ కుటుంబ భీమా విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్..
- ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, అజారుద్దీన్-కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై చర్చించనున్న కేబినెట్..
- మెట్రో స్వాధీన ప్రక్రియ, నిర్వహణపై చర్చించనున్న కేబినెట్..


