లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదం కారణంగా రెండు వాహనాల్లో 11 మంది ప్రాణాల కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. మీర్జాపూర్ జిల్లాలో ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి డ్రామాండ్‌గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న ట్రక్కుతో పాటు రెండు కార్లను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రెండు ట్రక్కులకు మధ్యలో కార్లు చిక్కుకుని మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు.
ఇక, ఈ ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన 11 మందిలో ఏడుగురు మీర్జాపుర్ వాసులు కాగా, ఒకరు సోన్‌భద్ర జిల్లాకు చెందిన వారున్నారు. ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు మీర్జాపూర్ పోలీసులు తెలిపారు.
#BreakingNews: मिर्जापुर में भीषण सड़क हादसा, ट्रक और बोलेरो की टक्कर में जिंदा जले 11 लोग, एक अनियंत्रित ट्रक ने बोलेरो समेत कई गाड़ियों को टक्कर मार दी. टक्कर इतनी भीषण थी कि बोलेरो गाड़ी में आग लग गई और उसमें सवार सभी 11 लोगों की जलकर मौत हो गई. #Mirzapur #RoadAccident #UP https://t.co/xdMOdw4Ed0 pic.twitter.com/8Gi8VQLqSK
— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) April 22, 2026



