హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్‌గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్‌షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)
ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్‌షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.
ఇక సిట్యుయేషన్‌షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్‌గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్‌షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)
Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh 'situationship' 😳😱
“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026


