Sowcar Janaki: ‘అప్పుడు ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని’

Veteran Actress Sowcar Janaki About Her Divorce And Assets - Sakshi

Sowcar Janaki About Her Divorce And Assets: 1950ల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికల్లో షావుకారు జానకి ఒకరు.  'షావుకారు' సినిమాతో పరిచమైన ఆమెకు సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు.  చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్‌, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్‌గా రాణించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటించిన ఆమె గతకొద్ది రోజులుగా ఎలాంటి సినిమాలు చేయడం లేదు.

చదవండి: బర్త్‌డే రోజే బాత్రూమ్‌లో విగతజీవిగా మోడల్‌, భర్తే చంపాడా?

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె తాజాగా ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు పరిశ్రమ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, తనని పక్కన పెట్టేశారని ఆమె బాధపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ  నేపథ్యంలో ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురవగా.. అలాంటిది ఏం లేదని, తనకు తెలుగులో మంచి ఆఫర్స్‌ వచ్చాయన్నారు. ఈ వార్తల్లో నిజం లేదని, ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్‌లతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు హిట్‌ అయ్యాయని ఆమె పేర్కొన్నారు. 

అనంతరం భర్తతో విడాకులపై ఆమె స్పందించారు. తాను సంపాదించిదంతా తన భర్త నాశనం చేశాడని చెప్పారు. ‘నేను కష్టపడి సంపాదిస్తుంటే. మా ఆయన ఆ డబ్బును తాగుడు, వ్యసనాలకు వృధా చేసేవాడు. కొంతకాలానికి చూస్తే ఆస్తులన్ని కరిగిపోయాయి. పిల్లల పేరు మీద కొన్న ఆస్తులు కూడా పోయాయి. ఎంతో నమ్మ ద్రోహానికి గురయ్యా. ఇప్పుడు అవన్ని ఉంటే కొన్ని వందల, వేల కోట్లు ఉండేవి. ఇక ఆయనతో ఉంటే పిల్లలను పెంచే పరిస్థితి కూడా ఉండదేమోనని నిర్ణయించుకున్న. అందుకే విడాకులు తీసుకున్నా’ అని ఆమె చెప్పారు.

చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్‌ ఫిక్స్‌

అంతేగాక ‘సినిమాలు చేస్తూ చాలా కష్టపడ్డాను. డబ్బు ఉంటే రియల్‌ ఎస్టేట్‌లో పెట్టేదాన్ని. ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను. కానీ మా ఆయన తన తాగుడు కోసం ఆస్తులు అమ్ముతూ వచ్చాడు. కనీసం నా గురించి, పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. ఆయన వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది. అంత కష్టపడుతూ కూడా నేను ఒక్క పూట భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి’ అంటూ షావుకారు జానకి చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top